Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?
- April 9, 2026 / 05:55 PM ISTByPhani Kumar
‘హిట్ 2’ తర్వాత హీరో అడివి శేష్ కొంత గ్యాప్ తీసుకుని చేసిన చిత్రం ‘డెకాయిట్'(Dacoit). మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని షానియల్ డియో దర్శకత్వం వహించారు. ‘అన్నపూర్ణ స్టూడియోస్’ బ్యానర్ పై సుప్రియా యార్లగడ్డ ఈ చిత్రాన్ని నిర్మించారు.
Dacoit
అనురాగ్ కశ్యప్, సునీల్ వంటి స్టార్స్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. ప్రమోషన్స్ లో భాగంగా విడుదల చేసిన టీజర్, ట్రైలర్, రుబారు, చుచ్చిబుడ్డి వంటి పాటలు అన్నీ ఆడియన్స్ ని ఆకట్టుకున్నాయి.

దీంతో ఏప్రిల్ 10న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాపై మొదటి నుండి భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అడివి శేష్ ట్రాక్ రికార్డు కూడా బాగుండటం అనేది బిజినెస్ కి కూడా బాగా కలిసొచ్చింది. ఆల్రెడీ ఈ చిత్రాన్ని నిర్మాత సుప్రియా ఇండస్ట్రీలో ఉన్న పెద్దలందరికీ చూపించడం జరిగింది. సినిమా చూసిన వారు అనంతరం తమ అభిప్రాయాన్ని కూడా వెల్లడించారు. వారి టాక్ ప్రకారం.. ‘డెకాయిట్’ సినిమా 2 గంటల 32 నిమిషాల నిడివి కలిగి ఉంటుందట.
మొదటి 15 నిమిషాలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందట. అడివి శేష్ ఇంట్రో, యాక్షన్ సెక్వెన్స్..లు, మధ్య మధ్యలో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ అన్నీ కథలోకి వెళ్లిపోయేలా చేస్తాయట. ప్రతి 10 నిమిషాలకి ఒక హై మూమెంట్ ఉంటుందట. ఇంటర్వల్ సెక్వెన్స్ వద్ద మృణాల్ ఠాకూర్ పాత్రకి ఇచ్చిన ట్విస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందట. సెకండాఫ్ పై ఆసక్తి పెంచుతుందట. ఇక సెకండాఫ్ కూడా ఎంగేజింగ్ గా సాగుతుందట.
క్లైమాక్స్ లో మళ్ళీ ట్విస్తులతో వావ్ ఫేక్టర్ ఇస్తుందని అంటున్నారు.మొత్తంగా సినిమా బాగుందని.. శేష్ కి మరో హిట్టు పడిందని అంటున్నారు. మరి రిలీజ్ రోజు ఎలాంటి టాక్ తెచ్చుకుంటుందో చూడాలి.
అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?












