Daggubati Abhiram: అభిరామ్ దగ్గుబాటి వెడ్డింగ్ కి సంబంధించిన అన్ సీన్ పిక్స్ వైరల్

  • December 13, 2023 / 08:01 PM IST

టాలీవుడ్ సెలబ్రిటీలు వరుసగా పెళ్లిపీటలెక్కుతున్న సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం. శర్వానంద్, వరుణ్ తేజ్ వంటి యంగ్ హీరోలు ఈ ఏడాది పెళ్లి చేసుకుని ఓ ఇంటి వారైన సంగతి తెలిసిందే. వీరితో పాటు టాలీవుడ్ అగ్ర నిర్మాత సురేష్ బాబు చిన్న కొడుకు, హీరో రానాకి తమ్ముడు అయిన దగ్గుబాటి అభిరామ్ కూడా పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్లోకి ఎంట్రీ ఇచ్చాడు.డిసెంబర్ 6 న శ్రీలంకలోని ఓ ఫంక్షన్ హాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్ గా అభిరామ్ పెళ్లి జరిగింది.

అతి తక్కువ మంది బంధుమిత్రులు, సన్నిహితుల మధ్య వీరి పెళ్లి ఘనంగా జరిగింది అని చెప్పాలి. అభిరామ్ భార్య పేరు ప్రత్యూష. ఈమె సురేష్ బాబు కుటుంబానికి దూరపు బంధువు. సురేష్ బాబుకి మేనకోడలు అవుతుంది. అంటే అభిరామ్ కి మరదలు అనమాట. 3 రోజుల పాటు అభిరామ్ – ప్రత్యూష..ల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. వీరి పెళ్లి ఫోటోలు ఆల్రెడీ కొన్ని బయటకు రావడం.. అవి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవ్వడం జరిగింది.

ఇప్పుడు మరికొన్ని ఫోటోలు బయటకు వచ్చాయి. వీటిలో దగ్గుబాటి ఫ్యామిలీ అంతా కలిసి నూతన వధూవరులతో దిగిన ఫోటోలు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి అని చెప్పొచ్చు. అలాగే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీలీల కూడా ఈ పెళ్లి వేడుకలో సందడి చేసింది. ఆమె ప్రత్యూషకి బెస్ట్ ఫ్రెండ్ అనే సంగతి తెలిసిందే. ఇక (Abhiram) అభిరామ్ – ప్రత్యూష..ల వెడ్డింగ్ కి సంబంధించిన కొన్ని అన్ సీన్ పిక్స్ ను మీరు కూడా ఓ లుక్కేయండి :

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus