Darling: ఆల్ టైమ్ నెంబర్ 2… రీ- రిలీజ్లో ‘డార్లింగ్’ టోటల్ కలెక్షన్స్
- May 12, 2026 / 06:00 AM ISTByPhani Kumar
ఈ సమ్మర్లో పెద్ద సినిమాలేవీ రిలీజ్ కావడం లేదు. ఐపీఎల్ సీజన్ కి భయపడి.. పెద్ద పెద్ద సినిమాలని రిలీజ్ చేయడానికి కూడా నిర్మాతలు సాహసించడం లేదు. మరోవైపు ‘డెకాయిట్’ వంటి మిడ్ రేంజ్ సినిమాలు రిలీజ్ అయినా బాక్సాఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్ సాధించలేని పరిస్థితి.
Darling
ఇక చిన్న సినిమాల సంగతి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇలాంటి సమయంలో రీ రిలీజ్ సినిమాలకి ఏమైనా కలిసొస్తుందా అంటే కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. ఆ అభిప్రాయాలను తారుమారు చేస్తూ భారీ కలెక్షన్స్ ను సాధించింది ‘డార్లింగ్'(Darling) సినిమా.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా కరుణాకరన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 16 ఏళ్ళు పూర్తిచేసుకుంటున్న సందర్భంగా ఏప్రిల్ 23న రీ రిలీజ్ చేశారు. ప్రభాస్ టీమ్ కానీ నిర్మాతలు కానీ ‘డార్లింగ్’ సినిమాని రీ రిలీజ్ చేసింది లేదు. థర్డ్ పార్టీ వాళ్ళే రీ రిలీజ్ చేసుకున్నారు. అయినప్పటికీ ఈ సినిమాని వీక్షించడానికి జనాలు క్యూ కట్టారు. మరి రీ రిలీజ్లో ‘డార్లింగ్’ సాధించిన కలెక్షన్ల వివరాలు ఓ లుక్కేద్దాం రండి :
| నైజాం | 4.5 cr |
| సీడెడ్ | 0.5 cr |
| ఆంధ్ర (టోటల్) | 2.3 cr |
| ఏపీ + తెలంగాణ (టోటల్) | 7.3 cr (షేర్) |
| రెస్ట్ ఆఫ్ ఇండియా | 1.05 cr |
| ఓవర్సీస్ | 0.65 cr |
| వరల్డ్ వైడ్ టోటల్ | 9 cr (గ్రాస్) |
‘డార్లింగ్’ చిత్రం రీ రిలీజ్లో రూ.9 కోట్ల గ్రాస్ వసూళ్ళు సాధించి రీజనల్ రీ రిలీజ్ సినిమాల్లో ఆల్ టైమ్ నెంబర్ 2 ప్లేస్ లో నిలిచింది. ‘మురారి’ ‘గబ్బర్ సింగ్’ వంటి సినిమాలు రీ రిలీజ్లో సాధించిన కలెక్షన్స్ ను ‘డార్లింగ్'( రీ రిలీజ్లో) అధిగమించింది. ఇదే సినిమాని ప్రభాస్ బర్త్ డేకి కనుక రీ రిలీజ్ చేస్తే.. ‘ఖలేజా’ కలెక్షన్స్ ని కూడా అధిగమించి నెంబర్ 1 ప్లేస్ ను కైవసం చేసుకునేది అనడంలో ఎటువంటి సందేహం లేదు. మరోసారి రీ రిలీజ్ చేసినా ‘డార్లింగ్’ మరింతగా కలెక్ట్ చేసే అవకాశం ఉంది.











