విశ్వక్ సేన్, నివేదా పేతురాజ్ హీరో, హీరోయిన్లుగా ‘పాగల్’ తర్వాత రూపొందిన మూవీ ‘దాస్ క ధమ్కీ’. ‘వన్మయే క్రియేషన్స్’ ‘విశ్వక్ సేన్ సినిమాస్’ బ్యానర్లపై కరాటే రాజు, విశ్వక్ సేన్ లు కలిసి ఈ చిత్రాన్ని రూ.20 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు.విశ్వక్ సేన్ కెరీర్లో ఇది భారీ బడ్జెట్ మూవీ అని చెప్పాలి. లియోన్ జేమ్స్, రామ్ మిరియాల సంగీతంలో రూపొందిన ఈ చిత్రంలోని పాటలకు మంచి స్పందన లభించింది.
టీజర్, ట్రైలర్ లు బాగానే ఉండటంతో మార్చ్ 22న ఉగాది కానుకగా రిలీజ్ అయిన ఈ చిత్రానికి యావరేజ్ టాక్ వచ్చింది. అయినా కలెక్షన్స్ బాగానే వచ్చాయి. ఫస్ట్ డే విశ్వక్ సేన్ కెరీర్లో బిగ్గెస్ట్ కలెక్షన్స్ ను సాధించిన ఈ చిత్రం..బ్రేక్ ఈవెన్ కూడా సాధించి హిట్ లిస్ట్ లోకి చేరిపోయింది. కానీ వీకెండ్ ముగిశాక ఈ మూవీ పెద్దగా కలెక్ట్ చేసింది ఏమీ లేదు. ఒకసారి క్లోజింగ్ కలెక్షన్స్ ను గమనిస్తే :
నైజాం | 3.40 cr |
సీడెడ్ | 1.11 cr |
ఉత్తరాంధ్ర | 0.98 cr |
ఈస్ట్ | 0.66 cr |
వెస్ట్ | 0.37 cr |
గుంటూరు | 0.63 cr |
కృష్ణా | 0.51 cr |
నెల్లూరు | 0.29 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 7.95 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 1.09 cr |
ఓవర్సీస్ | 1.28 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 10.32 cr (షేర్ |
‘దాస్ క ధమ్కీ’ (Das Ka Dhamki) చిత్రానికి రూ.7.58 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.7.9 కోట్ల షేర్ ను రాబట్టాలి. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం రూ.10.32 కోట్ల షేర్ ను సాధించి బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా రూ.2.42 కోట్ల ప్రాఫిట్స్ ను అందించింది. నాని ‘దసరా’ సినిమా వల్ల ‘దాస్ క ధమ్కీ’ సైలెంట్ అయిపోయింది. లేదంటే ఇంకాస్త కలెక్ట్ చేసుండేదని చెప్పాలి.
శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!
బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!