Dasara: హీరో నానికి అక్కడ షాక్ తగిలిందా.. ఏం జరిగిందంటే?

  • April 20, 2023 / 06:04 PM IST

2023 సంవత్సరంలో పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్న సినిమాలలో దసరా మూవీ ఒకటనే సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నాని నటనకు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు దక్కాయి. దసరా మూవీ ఒకింత భారీ బడ్జెట్ తో తెరకెక్కినా నాన్ థియేట్రికల్ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడవడం వల్ల నిర్మాతకు మేలు జరిగింది. నైజాం, వైజాగ్, ఈస్ట్ ఏరియాలలో దసరా బ్రేక్ ఈవెన్ కాగా మిగతా ఏరియాలలో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కాలేదు.

ఈ సినిమా (Dasara) పలు ఏరియాలలో కొంతమేర నష్టాలను మిగల్చడం నాని ఫ్యాన్స్ ను సైతం ఒకింత బాధ పెడుతోంది. మరోవైపు ఈ సినిమా మరికొన్ని రోజుల్లో ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. విడుదలైన నాలుగు వారాలకే ఈ సినిమా ఓటీటీలో అందుబాటులోకి రానుందని బోగట్టా. తన సినిమాల ఓటీటీల రిలీజ్ డేట్లపై నాని ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉంది. నాని పారితోషికం ప్రస్తుతం 25 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది.

నానిని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య కూడా ఊహించని స్థాయిలో పెరుగుతుండటం గమనార్హం. నిర్మాతలు తమ సినిమాల హక్కులను హోల్ సేల్ పద్ధతిలో అమ్మడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడుతోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. నాని కొత్త తరహా కథలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుండటం గమనార్హం. నానికి ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు.

నాని ప్రస్తుతం ఒక సినిమాలో నటిస్తుండగా ఈ ఏడాదే ఆ సినిమా రిలీజ్ కానుందని తెలుస్తోంది. ఏడాదికి రెండు సినిమాలు విడుదలయ్యే విధంగా నాని కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు. వరుస విజయాల ద్వారా నానికి పాపులారిటీ సైతం ఊహించని స్థాయిలో పెరుగుతోంది. నాని అటు మాస్ ప్రేక్షకులను, ఇటు క్లాస్ ప్రేక్షకులను మెప్పించే కథ్లకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus