ఓపెనింగ్స్ ఓకే కానీ.. కష్టమే కామ్రేడ్

విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన ‘డియర్ కామ్రేడ్’ చిత్రం మొదటి రోజే ప్లాప్ టాక్ ను సొంతం చేసుకుంది. భరత్ కమ్మ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘మైత్రి మూవీ మేకర్స్’ ‘బిగ్ బెన్ సినిమాస్’ బ్యానర్లు కలిసి నిర్మించాయి. జూలై 26 న ఈ చిత్రాన్ని తెలుగు,తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్ గా విడుదల చేశారు. వీకెండ్ ను ఈ చిత్రం బాగానే క్యాష్ చేసుకుంది. సోమవారం ఒక్క నైజాం ఏరియా పక్కన పెడితే మిగిలిన అన్ని ఏరియాల్లోనూ ఈ చిత్రం కలెక్షన్లు ఘోరంగా పడిపోయాయి. ఆ నైజాం ఏరియాలో కూడా బోణాల సెలవు కాబట్టి కొంత మేర హౌస్ ఫుల్స్ పడ్డాయి.

ఇక ‘డియర్ కామ్రేడ్’ నాలుగు రోజుల కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :

నైజాం – 6.44 కోట్లు
సీడెడ్ – 1.13 కోట్లు
వైజాగ్ – 1.62 కోట్లు


ఈస్ట్ – 1.22 కోట్లు
కృష్ణా – 0.76 కోట్లు
గుంటూరు – 1.05 కోట్లు


వెస్ట్ – 0.86 కోట్లు
నెల్లూరు – 0.50 కోట్లు
———————————————————–
ఏపీ+నైజాం టోటల్ – 13.58 కోట్లు (షేర్)
————————————————————-

ఓపెనింగ్స్ విషయంలో పర్వాలేదనిపించుకున్న ‘డియర్ కామ్రేడ్’. వీక్ డేస్ లో మాత్రం ఆ దూకుడు ఏమాత్రం చూపించడం లేదు. ఈరోజు బుకింగ్స్ చాలా డ్రై గా ఉన్నాయి. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి 50 లక్షల లోపే షేర్ ఉండొచ్చని సమాచారం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus