ఒకే ఇంట్లో ఉన్నవాళ్లే ఏ వీకెండ్‌లోనో, లేకపోతే స్పెషల్ డేస్‌లోనే కాసేపు కూర్చుని మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఉరుకుల పరుగుల జీవితంలో ఇలాంటివి కామన్‌లెండి అని అనుకునే పరిస్థితి. ఇలాంటి రోజుల్లో ఒకే ఫ్రొఫెషన్‌లో అందులోనూ యాక్టింగ్ ప్రొఫెషన్‌లో ఉన్న వాళ్లు, అందులో స్టార్ స్టేటస్‌లో ఉన్నవాళ్లు టైమ్ ఎలా స్పెండ్ చేస్తారు? వ్యాలిడ్ క్వశ్చనే కదా. ఇదే ప్రశ్న ప్రముఖ కథానాయిక బాలీవుడ్ బ్యూటీ దీపిక పడుకొణెను అడిగితే ఆసక్తికర సమాధానం చెప్పింది.
బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్‌వీర్ సింగ్ – దీపికా పదుకొణె ప్రస్తుతం వాళ్ల కెరీర్‌తో చాలా బిజీ. వరుస సినిమాలతో అదరగొడుతున్నారు. అందుకే ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి ఓ ప్లాన్ వేసుకున్నారట. ఇటీవల ఓ ఇంటర్వ్యూకు వచ్చిన దీపిక ఈ విషయాలను చెప్పుకొచ్చింది. తామిద్దరం మాట్లాడుకోవడానికి షెడ్యూల్ చేసుకుంటామని తెలిపింది. అంతే కాదు ఒక్కోసారి వేకువజామున నాలుగు గంటల వరకు డ్యాన్స్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తామని కూడా చెప్పింది.
నా భర్తతో సమయం గడపడం నాకు ముఖ్యం. మా ఇద్దరికీ అంత తీరిక ఉండదు. ఒక్కోసారి నెల రోజుల షూటింగ్ కోసం వేరే ప్రదేశాల్లో ఉంటాం. ఒక్కోసారి షూటింగ్ అయిపోయి రణ్‌వీర్ ఇంటికి వచ్చే సమయానికి నేను షూటింగ్‌కు వెళ్తుంటాను. అందుకే మేం కలిసి గడపాల్సిన సమయాన్ని షెడ్యూల్ చేసుకుంటాం. ఎంత సమయం గడిపామన్నది ముఖ్యం కాదు అని నేను భావిస్తాను. అందుకే గడిపిన కొంత సమయాన్ని ఎంజాయ్ చేశాలా ప్లాన్ చేసుకుంటాం అని దీపిక చెప్పింది.
ఇక డ్యాన్స్ అంటే మాకు ఇష్టం. వీకెండ్స్‌లో కొన్నిసార్లు నేను, రణ్‌వీర్ తెల్లవారుజామున నాలుగు వరకు డ్యాన్స్ చేస్తాం అని వాళ్ల మధ్య జరిగే క్యూట్ మూమెంట్స్ గురించి చెప్పింది దీపిక. ఇక వాళ్ల సినిమాల విషయానికొస్తే.. దీపికా పడుకొణె ప్రస్తుతం ప్రభాస్ – నాగ్ అశ్విన్‌ల ‘కల్కి 2898 ఏడీ’ సినిమాలో నటిస్తోంది. రణ్‌వీర్ (Ranveer) అయితే ‘సింగమ్ అగైన్’ అనే ‘సింగమ్’ ఫ్రాంచైజీలో నటిస్తున్నాడు.
జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!