పెళ్లవ్వగానే మెడ మీద రణబీర్ కపూర్ టాటూని తీయించేసింది

  • November 21, 2018 / 01:05 PM IST

స్టార్ కపుల్ దీపిక పదుకొనే-రణవీర్ సింగ్ ఈమధ్యే వివాహం చేసుకొని దంపతులయ్యారు. దీపిక పదుకొనే మెడపై మాజీ ప్రియుడు రణబీర్ కపూర్ టాటూ ఆర్‌కె అనే అక్షరాలతో ఉండేది. అయితే ఇప్పుడు అది చెరిగిపోయింది. దీప్-వీర్ తాజా ఫోటోల్లో అది క్లియర్ గా తెలిసింది. దీపిక.. రణవీర్ తో లవ్ లో పడక ముందు రణబీర్ కపూర్ ను ప్రేమించింది.. ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగే రోజుల్లో తన మెడపై రణబీర్ కపూర్ పచ్చబొట్టు పొడిపించుకుంది. కొంతకాలానికి ఇద్దరూ విడిపోయారు. తర్వాత దీపిక హీరో రణవీర్ సింగ్ ప్రేమలో పడింది.. అయినా ఆ టాటూను మాత్రం తొలగించలేదు. కానీ ఇటలీలో పెళ్ళిపీటలు ఎక్కేముందు పాత జ్ఞాపకాన్ని వదిలించుకున్నట్టుంది. దీంతో పచ్చబొట్టు కనిపించకపోవడంతో ఇప్పుడది హాట్ టాపిక్ అయింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus