Deepika Padukone: భర్త ముందే నోరు జారిన హీరోయిన్ దీపికా పదుకొనే..!

మా ఆయ‌న ర‌ణ‌వీర్‌తో క‌న్నా నాకు ఆ హీరోతోనే మంచి కెమెస్ట్రీ ఉందంటూ మ‌రోసారి వార్త‌ల్లోకెక్కింది దీపికా ప‌దుకునే. ఇప్ప‌టికే జ‌వాన్‌, గెహ‌రియాన్ వంటి సినిమాల‌లో అంగాంగ ప్ర‌ద‌ర్శ‌న‌, ముద్దు సీన్ల‌తో నిత్యం వార్త‌ల్లో ఉంటూ తీవ్రంగా విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్న‌ ఈ పొడుగుకాళ్ల సుంద‌రి త‌న భ‌ర్త స‌మ‌క్షంలోనే నోరు జారింది. దేశ వ్యాప్తంగా మంచి ఆద‌ర‌ణ ఉన్న టీవీ షో కాఫీ విత్ క‌రణ్ సీజ‌న్ 8 త్వ‌ర‌లో టెలికాస్ట్ కానుంది.

ఈక్ర‌మంలో ఫ‌స్ట్ ఎపిసోడ్‌కు బాలీవుడ్ స్టార్ క‌పుల్ ర‌ణ‌వీర్ సింగ్‌, దీపికా ప‌దుకునే గెస్టులుగా హాజరయ్యారు. ఈ కార్య‌క్ర‌మానికి సంబంధించిన ప్రోమోను మంగ‌ళ‌వారం విడుద‌ల చేయ‌గా.. నెట్టింట ట్రెండింగ్‌లో ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు 7 భాగాలుగా వ‌చ్చిన ఈ కాఫీ విత్ క‌ర‌ణ్ కార్య‌క్ర‌మాల్లో ర‌ణ‌వీర్‌, దీపికా విడివిడిగా ఇత‌ర న‌టుల‌తో క‌లిసి పాల్గొన్నారు.. కానీ జంట‌గా పాల్గొనడం ఇదే ప్ర‌ధ‌మం. ఈ ప్రోమోలో ఓ సంద‌ర్భంలో క‌ర‌ణ్ జోహ‌ర్ మీకు ర‌ణ‌వీర్‌తో కాకుండా ఇండ‌స్ట్రీలో ఎవ‌రితో మంచి కెమిస్ట్రీ ఉంద‌ని బావిస్తున్నార‌ని దీపికాను అడ‌గ‌గా..

హృతిక్‌తో మంచి బాండింగ్ ఉంటుంద‌ని అనుకుంటున్నాన‌ని, అత‌నితో స్క్రీన్‌పై మంచి కెమిస్ట్రీ వ‌ర్కౌటవుతుంద‌ని చెప్ప‌డంతో ర‌ణ‌వీర్ ఖంగు తిన్నాడు. అయితే షారుఖ్‌తో ఐదారు సినిమాలు, ర‌ణ‌వీర్‌తో నాలుగు సినిమాలు చేసిన దీపిక వారిద్ద‌రిని కాద‌ని హృతిక్ పేరు చెప్ప‌డంపై కార‌ణం ఏమై ఉంటుందా అని అభిమానులు ఆరా తీస్తున్నారు. ఇదిలా ఉండ‌గా హృతిక్‌, దీపికా ప‌దుకునేలు మొద‌టిసారిగా ‘ఫైట‌ర్’ అనే సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు త్వ‌ర‌లో రానున్నారు.

దేశ వ్యాప్తంగా చాలా పాపుల‌ర్ అయిన ఈ కాఫీ విత్ క‌ర‌ణ్ ఆరు సీజ‌న్ల‌లోను కేవ‌లం బాలీవుడ్ న‌టుల‌తో మాత్ర‌మే చేస్తూ సౌత్‌ను దూరం పెడుతూ వ‌చ్చింది. రాజ‌మౌళి బాహుబ‌లి విజ‌యానంత‌రం ప‌రిస్థితులు మార‌డంతో అంద‌రి దృష్టి తెలుగు ఇండ‌స్ట్రీపై ప‌డింది. ఈ క్ర‌మంలో గ‌త సీజ‌న్‌లో ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్‌, రాజ‌మౌళి, స‌మంత‌లు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus