ప్రభాస్ సినిమాలో దీపికా పదుకొణే అంటూ అనవసరమైన గోల

  • March 5, 2020 / 12:22 PM IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్ కలిసి ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. వైజయంతి మూవీస్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కనుండి. ఈ సినిమాని ప్యాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కిస్తున్నట్లు ఇటీవల నాగ్ అశ్విన్ తెలిపారు. అందుకే ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణేని తీసుకోవాలని భావిస్తున్నారు.

ముందుగా చాలా మంది హీరోయిన్ల పేర్లను సంపాదించారు. కానీ దీపికని ప్రాజెక్ట్ లోకి తీసుకురావడం ద్వారా బిజినెస్ కూడా బాగా జరుగుతుందని భావిస్తున్నారు. ఇటీవల ఆమెని కలిసి కథ కూడా వినిపించారని టాక్. అయితే ఈ విషయంలో ఎలాంటి అధికార ప్రకటన రాలేదు. అయితే దర్శకుడు నాగ్ అశ్విన్ మాత్రం ఈ వార్తల్లో నిజం లేదని అంటున్నారు. రీసెంట్ గానే సినిమాని అనౌన్స్ చేశామని.. సినిమా మొదలవ్వడానికి ఇంకా పది నెలల సమయం పడుతుందని.. ఇంకా హీరోయిన్ గా ఎవరినీ ఫైనల్ చేయలేదని అంటున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ గర్వపడేలా సినిమా ఉంటుందని చెప్పారు. ఇంకా సినిమాకి ఎలాంటి టైటిల్ అనుకోలేదని.. దక్షిణాది అన్ని భాషలతో పాటు హిందీలో కూడా సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నట్లు చెప్పారు.

Most Recommended Video

‘హిట్ ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భీష్మ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘టాలీవుడ్ స్టార్ హీరోల రెమ్యూనరేషన్లు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus