Deepthi Sunaina: ఆ వార్తల్లో నిజం లేదంటున్న బిగ్ బాస్ బ్యూటీ!

  • January 24, 2022 / 10:41 PM IST

బిగ్ బాస్ బ్యూటీ దీప్తి సునైనా సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో తెలిసిందే. తన మీద వచ్చే నెగెటివ్ కామెంట్స్, ట్రోలింగ్స్ పై ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఉంటుంది. తనపై ట్రోలింగ్ చేసేవరకు అంతే ధీటుగా సమాధానాలు చెబుతుంటుంది దీప్తి. తాజాగా ఈ బ్యూటీకి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇప్పటివరకు యూట్యూబ్ కవర్ సాంగ్స్, స్పెషల్ ప్రైవేట్ ఆల్బమ్స్ తో కాలం గడిపిన ఈ బ్యూటీకి టాలీవుడ్ లో అవకాశం వచ్చిందని కొన్ని మీడియా వర్గాలు వార్తలు ప్రచురించాయి.

తాజాగా ఈ వార్తలపై స్పందించింది దీప్తి సునయన.’హీరోయిన్‌గా దీప్తీ సున‌య‌న‌… త్వ‌ర‌లో టాలీవుడ్‌లోకి ఎంట్రీ’ అని రాసి ఉన్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేసిన దీప్తి… ‘ఫేక్! నాకు తేలియదే ఇది’ అంటూ వెటకారంగా బదులిచ్చింది. దీన్ని బట్టి ఆమె హీరోయిన్ గా ఏ సినిమా చేయడం లేదని తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో దీప్తి సునయన పలు కారణాలతో వార్తల్లో నిలుస్తుంది. మొన్నటివరకు ఆమె బ్రేకప్ కి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.

షణ్ముఖ్ తో విడిపోతున్నట్లు దీప్తి సోషల్ మీడియా వేదికగా ప్రకటించినప్పటి నుంచి వారిద్దరి రిలేషన్ కి సంబంధించిన వార్తలు వస్తూనే ఉన్నాయి.

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus