Vaazha 2: రూ.5 కోట్లతో సినిమా తీస్తే రూ.180 కోట్ల వసూళ్లు.. నిర్మాతల్లో ఒకరిది టాలీవుడ్‌

Advertisement

చిన్న సినిమా – పెద్ద విజయం.. ఈ మాటకు నిలువెత్తు నిదర్శనం, సాక్ష్యం కావాలి అంటే కొన్ని సినిమాలే ఉంటాయి. ఇప్పుడు ఆ జాబితాలోకి ‘వాళా 2’ సినిమా వచ్చి చేరంది. ఎందుకంటే కేవలం రూ.5 కోట్లతో రూపొందించిన ఈ సినిమా రూ.180 కోట్లకుపైగా వసూళ్లు అందుకుంది కాబట్టి. మలయాళ సినిమా పరిశ్రమలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల జాబితాలో టాప్‌ 5లో కూడా నిలిచింది. ఏప్రిల్‌ 2న సైలెంట్‌గా విడుదలైన ఈ సినిమా ఇప్పుడు చరిత్ర సృష్టిస్తోంది.

Vaazha 2 Movie

రెండేళ్ల క్రితం వచ్చిన ‘వాళా: బయోపిక్‌ ఆఫ్‌ ఎ బిలియన్‌ బాయ్స్‌’ అనే సినిమాకు సీక్వెల్‌గా ఈ ‘వాళా 2’ సినిమా రూపొందింది. రూ.4 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా రూ.38 కోట్లు వసూలు చేసి అప్పట్లో సంచలనం సృష్టించింది. ఇప్పుడు రెండో పార్టు ఏకంగా రూ.180 కోట్లకుపైగా అందుకోవడం గమనార్హం. మొదటి భాగం మాదిరిగానే రెండో పార్టు కూడా నలుగురు స్నేహితుల కథ. హషీర్, అలన్, అజిన్, వినాయక్ అనే విద్యార్థుల జీవితంలో జరిగిన సంఘటనలే ఈ చిత్రం.

ఈ రెండు చిత్రాలకు విపిన్‌ దాస్‌ కథ అందించగా, రెండో భాగాన్ని సావిన్‌ ఎస్‌ఏ తెరకెక్కించారు. షైన్‌ స్క్రీన్స్‌ నిర్మాత సాహు గారపాటి కూడా ఈ సినిమాకు ఒక నిర్మాత కావడం విశేషం. మలయాళ సినిమా పరిశ్రమలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా ‘లోక చాప్టర్‌1: చంద్ర’. సుమారు రూ.300 కోట్లు అందకుంది. ఆ మోహన్‌లాల్‌ ‘ఎ2: ఎంపురాన్‌’, ‘మంజుమ్మల్‌ బాయ్స్‌’, ‘తుడరుమ్‌’ ఉన్నాయి. ఇప్పుడు ‘వాళా 2’ ఆ తర్వాత స్థానంలోకి వచ్చింది. అన్నట్లు ఈ సినిమా తెలుగులోనూ రానుంది. ‘వాలా 2’ పేరుతోనే ఏప్రిల్‌ 24న విడుదల చేస్తున్నారు. ‘వాళా’ అంటే అరటి మొక్క అని అర్థం. పనీపాటా లేకుండా తిరిగే వాళ్లను మలయాళంలో ఇలా పిలుస్తారట.

నిర్మాణం పై దృష్టి పెట్టిన కొరటాల శివ

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus