మెగా డాటర్ నిహారిక పెళ్లి డిసెంబర్ 9న రాత్రి 7 గంటల 15 నిమిషాలకు జరుగబోతోంది. డెస్టినేషన్ వెడ్డింగ్ గా జరుగబోతున్నట్టు కూడా ఆమె తండ్రి నాగబాబు ఎప్పుడో ప్రకటించారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో నిహారిక, చైతన్యల వివాహం ఐదు రోజుల పాటు గ్రాండ్‌గా జరుగబోతోంది. కోవిడ్ నిబంధనలను పాటిస్తూనే అతి తక్కువ మంది సమక్షంలో నిహారిక పెళ్లి జరుగబోతోంది. ఇప్పటికే పెళ్లి పనుల్లో మెగా ఫ్యామిలీ అంతా బిజీగా గడుపుతున్నారు.
ఎక్కువగా నాగబాబు తనయుడు వరుణ్ తేజ్… పెళ్లి పనులను దగ్గరుండి చేసుకుంటున్నాడట. ఇందుకోసం అతను ఓ టీం ను కూడా రెక్రూట్ చేసుకున్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా… నిహారిక పెళ్లి కాకుండానే అల్లుడు చైతన్య కోసం భారీగా లాంఛనం అందజేస్తున్నాడట నాగబాబు. అందుతున్న సమాచారం ప్రకారం అది రూ. 10 కోట్ల వరకూ ఉంటుందని తెలుస్తుంది. ఇక పెళ్లికి నగల ఖర్చు మరో రూ. 2 కోట్ల వరకూ ఉంటుందట.
వీటితో పాటు నిహారిక పేరుతో ఉన్న బంగ్లాను కూడా అల్లుడికి నాగబాబు కట్టపెడుతున్నాడట. నిజానికి సెలబ్రిటీల ఇంట్లో పెళ్లి అంటే ఇంకా భారీగానే ఖర్చవుతుంటుందట. నాగబాబు ఖర్చు పెట్టేది ఇంకా తక్కువే అని ఇన్సైడ్ టాక్. ఏమైనా తన గారాల పట్టి కోసం నాగబాబు.. ఎటువంటి లోటు చెయ్యడం లేదని తెలుస్తుంది. ఇక లాక్ డౌన్ టైములో జరిగిన పెళ్లిల్లో నిహారిక పెళ్లి కూడా భారీ బడ్జెట్ తో చేస్తున్నట్టు స్పష్టమవుతుంది.