Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » దేవ‌దాస్ సినిమా ప్రెస్ మీట్

దేవ‌దాస్ సినిమా ప్రెస్ మీట్

  • September 25, 2018 / 09:40 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

దేవ‌దాస్ సినిమా ప్రెస్ మీట్

నాగార్జున‌, నాని హీరోలుగా శ్రీ‌రామ్ ఆదిత్య తెర‌కెక్కించిన సినిమా దేవ‌దాస్. ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 27న విడుద‌ల కానుంది. ఈ సంద‌ర్భంగా మీడియా స‌మావేషం ఏర్పాటు చేసారు ద‌ర్శ‌క నిర్మాత‌లు.

నిర్మాత అశ్వినీద‌త్ మాట్లాడుతూ.. మ‌హాన‌టి అప్పుడు నేను ఎప్పుడు మిమ్మ‌ల్ని క‌ల‌వ‌లేదు. ఈ సినిమాకు మాత్రం పెద్ద హీరోలు నాకు తోడుగా, అండ‌గా.. వాళ్ల భుజాల‌పై వేసుకుని న‌డిపించిన సినిమా కాబ‌ట్టి మీ ముందుకు వ‌చ్చాను. చాలా ఏళ్ల త‌ర్వాత వైజ‌యంతి మూవీస్ బ్యాన‌ర్ నుంచి ప్ర‌తిష్మాత్మ‌కంగా నిర్మించిన చిత్రం ఇది. రెండున్న‌ర గంట‌ల పాటు ప్రేక్ష‌కుల‌ను న‌వ్వించే సినిమా ఇది అవుతుంది. ఇద్ద‌రు గొప్ప హీరోల న‌ట‌న‌ను మీరు సెప్టెంబ‌ర్ 27న చూడ‌బోతున్నారు. చ‌క్క‌టి వినోదంతో పాటు చిన్న సందేశం కూడా సినిమాలో ఉండ‌బోతుంది. ఈ సినిమా గుండ‌మ్మ క‌థలా క్లాసిక్ అవుతుంద‌ని భావిస్తున్నాను. మీరు ఇచ్చే ప్రోత్సాహంతోనే వైజ‌యంతి మూవీస్ మ‌రింత ముందుకు వెళ్ల‌డానికి.. మా పిల్ల‌లకు ఉత్సాహం ఇవ్వ‌డానికి తోడ్ప‌డుతుంద‌ని.. మీ అండ‌దండ‌లు ఎప్పుడూ ఉండాల‌ని కోరుకుంటూ సెల‌వు తీసుకుంటున్నాను.. అని చెప్పారు.

Devadas

హీరో నాగార్జున మాట్లాడుతూ.. అశ్వినీదత్ గారు ఆఖ‌రి పోరాటం అప్పుడు ఎలా ఉన్నారో.. ఇప్పుడు అలాగే ఉన్నారు. ఆయ‌నకు సినిమాపై ఉన్న ప్యాష‌న్ ఇంకా అలాగే ఉంది. పైగా ఇప్పుడు ఆయ‌న‌కు ఇద్ద‌రు హెల్ప్ కూడా వ‌చ్చారు.. త‌న కూతుళ్లు రూపంలో.. ఒక అల్లుడు రూపంలో హెల్ప్ చేస్తూనే ఉన్నారు. నాలో వ‌చ్చిన తేడా ఏంటంటే ఇప్పుడు టైమ్ కు వ‌స్తున్నాను. దేవ కారెక్ట‌ర్ ఇంట‌ర్నేష‌న‌ల్ డాన్ కారెక్ట‌ర్ గా తీసుకున్నాం. దాంట్లో వ‌యోలెన్స్ కానీ.. మాఫియా యాక్టివిటీస్ కానీ చూపించ‌లేదు. ఎక్కువ‌గా ప‌ర్స‌న‌ల్ లైఫ్ చూపించాం. అందుకే నాకు కూడా కొత్త‌గా ఉంది. జ‌న‌ర‌ల్ గా మాఫియా అన‌గానే అంతా ఒక‌లా ఊహిస్తారు. కానీ ఇది అలా ఉండ‌దు. అదే కొత్త‌గా ఉంటుంది కూడా. దాస్ తో ఉండే స్నేహ‌మే దేవ‌దాస్ సినిమా. ఒక‌రిని ఒక‌రెలా ఇన్ఫ్లూయెన్స్ చేస్తార‌నేది సినిమాలో మెయిన్ పాయింట్. ఇది ఏదో సీరియ‌స్ గా తీసిన సినిమా కాదు.. స‌ర‌దాగా న‌వ్వుతూ ఉండే సినిమా.
మీకు ఎప్పుడున్నా రాజ్ కుమార్ హిరాణి సినిమా చూస్తే మున్నాభాయ్, సంజూ లాంటి సినిమాల జాబితాలో ఉంటుంది దేవ‌దాస్. ముందు కృష్ణ‌దాస్ అనుకున్నాం.. కానీ ఆ త‌ర్వాత దేవ‌దాస్ అని పెట్టారు. పైగా దత్ గారికి కూడా సెంటిమెంట్ మొన్నే మ‌హాన‌టి కూడా వ‌చ్చింది. దేవ‌దాస్ అనేది క్లాసిక్.. రీ కాల్ వ్యాల్యూ కూడా బాగుంటుంది. అందుకే రాయ‌ల్ సెల్యూట్ బాటిల్ కూడా పెట్టాం. సినిమాలో చాలా మంది ఆర్టిస్టులు ఉన్నాం.. అంద‌ర్నీ బ్యాలెన్స్ చేయ‌డం అనేది ద‌ర్శ‌కుడికి ఈజీ కాదు. చాలా ప్రెజ‌ర్ ఉంది. ఈ విష‌యంలో శ్రీ‌రామ్ ఆదిత్య చాలా మొండివాడు. అయితే లేజీ అని ఎందుకు అన్నా అంటే నెల రోజుల ముందే సినిమాను చూపించి ఉంటే బాగుండేది అని నా ఫీలింగ్. 3 డేస్ ముందు కాపీ చూపిస్తే ఏం చేయ‌లేం.
ఇది అంద‌రు ద‌ర్శ‌కుల‌కు నా విన్న‌పం. నేను ఎప్పుడూ రాజ‌కీయాల్లోకి వెళ్ల‌ను. అది మీరు అనుకుంటున్నారు.. నేనెప్పుడూ అనుకోను. కేటీఆర్ ఫ్రెండ్ గానే ఉంటాను కానీ రాజ‌కీయాల్లోకి వెళ్ల‌ను. ఈ సినిమాలో నాకు బాగా న‌చ్చిన సాంగ్ ఏమో ఏమో.. అది నానికి ఇచ్చారు. జ‌లస్ గా ఫీల్ అవుతున్నాను. సిధ్ శ్రీ‌రామ్ పాడాడు. ఇక వారు వీరు కూడా బాగుంది. నా ప‌క్క‌న అంద‌మైన అమ్మాయి కూడా ఉంది. చేసే సినిమాలు బ‌ట్టి నా గెట‌ప్ మారుతుంది. ఈ సినిమాలో కూడా యంగ్ గా క‌నిపించ‌డానికి సినిమాటోగ్ర‌ఫ‌ర్ స్యామ్ ద‌త్ చాలా పెద్ద కంట్రిబ్యూట‌ర్ సినిమాకు. అన్ని డిస్క‌స్ చేసుక‌ని అద్భుతంగా సినిమాను తెర‌కెక్కించారు.. స్యామ్ తో మ‌రోసారి వ‌ర్క్ చేయాల‌ని ఉంది అని అన్నారు.

Devadas

హీరో నాని మాట్లాడుతూ.. దాస్ చాలా ఇన్నోసెంట్. సాఫీగా సాగుతున్న లైఫ్ లోకి ఊహించ‌కుండా ఎవ‌రూ లైఫ్ లో చూడ‌ని ఓ వ్య‌క్తి ఫ్రెండ్ గా వ‌స్తే వాడి లైఫ్ ఎలా మారిపోతుంది అనేది కారెక్ట‌ర్. నిజాన్ని నిజంగానే ఈ సినిమాలో చూపించాం. ఫోన్ విష‌యంలో కూడా ఎప్పుడూ తాను చేతిలో ప‌ట్టుకునే ఉంటాన‌ని నాగ్ స‌ర్ వీడియో చేసారు. అయితే నాగార్జున గారు ప‌క్క‌నే ఉన్న‌పుడు అలాంటి ధైర్యం చేయ‌లేదు కానీ వీడియో చేసే స‌రికి అది వైర‌ల్ అయిపోయింది. నాగార్జున గారితో స్క్రీన్ స్పేస్ చేసుకోవ‌డ‌మే అదృష్టం.
ఆయ‌న సినిమాల కోసం టికెట్ల కోసం కొట్టుకున్నాను. అలాంటిది ఇప్పుడు ఆయ‌న‌తో న‌టించ‌డం అనేది నా అదృష్టం. న‌చ్చినా న‌చ్చ‌క‌పోయినా ఓపెన్ గా చెప్పేస్తారు. సినిమా అయిపోయిన త‌ర్వాత ఆయ‌న నా గురించి చెప్పిన మాట‌లు ఎప్ప‌టికీ మ‌రిచిపోలేను. మా కెమిస్ట్రీ కూడా చాలా బాగుంటుంది. నా లైఫ్ లో మోస్ట్ హెట్టిక్ వీకెండ్ ఇది. మోస్ట్ స్ట్రెస్ ఫుల్ వీక్.. ఎక్సైటింగ్ వీక్ కూడా ఇదే. బిగ్ బాస్ ఫైన‌ల్ కూడా ఇదే వారం ఉండ‌టంతో ఒత్తిడి ఉంది. ప్ల‌స్ మైన‌స్ రెండూ ఉన్నాయి. ఈ వారం అయిపోతే కొన్ని రోజులు కాశీకో అలా వెళ్లిపోతాను.

Devadas

హీరోయిన్ ర‌ష్మిక మాట్లాడుతూ.. నా కారెక్ట‌ర్ ఇందులో గాల్ నెక్ట్స్ డోర్ లా ఉంటుంది. సినిమా చూసిన త‌ర్వాత మీకే అర్థం అవుతుంది. రేపు సినిమా చూసిన త‌ర్వాత ప్రేక్ష‌కుల‌కు కూడా న‌చ్చుతుంద‌ని భావిస్తున్నాను అని చెప్పారు.

హీరోయిన్ ఆకాంక్ష సింగ్ మాట్లాడుతూ.. నాగార్జున గారు సీన్ విష‌యాల్లో చాలా హెల్ప్ చేసారు. ఆయ‌న చెప్పిన టిప్స్ అద్భుతంగా ప‌నిచేసాయి. ఆయ‌న‌తో ప‌నిచేయ‌డం.. స్క్రీన్ షేర్ చేసుకోవ‌డం అదృష్టంగా భావిస్తున్నాను అని చెప్పారు.

Devadas

ద‌ర్శ‌కుడు శ్రీ‌రామ్ ఆదిత్య మాట్లాడుతూ.. సెట్ లో మోస్ట్ కంఫ‌ర్ట‌బుల్ యాక్ట‌ర్స్ నాగార్జున గారు. ఆయ‌న వ‌చ్చిన త‌ర్వాత భ‌య‌పెట్ట‌డాలు ఉండ‌వు. చాలా కూల్ గా ఉంటాడు. మ‌ల్టీస్టార‌ర్స్ అని తేడా నాకు ఉండ‌దు. మ‌ల్టీస్టార‌ర్ అంటే ఎగ్జైట్ మెంట్ ఉంటుంది. ఒకేసారి ఇద్ద‌రు బెట‌ర్ ప‌ర్ఫార్మెన్స్ చూడొచ్చు. నాకు అది న‌చ్చుతుంది. బేసిక్ గా ఓ లైన్ విన్నామో.. స‌త్యానంద్ గారు లాంటి సీనియ‌ర్ల‌తో 4 నెల‌లు కూర్చున్న త‌ర్వాత షూట్ చేయ‌గలిగాను. ఇది ఏ సినిమా రీమేక్ కాదు. సొంత క‌థ‌తోనే దేవ‌దాస్ తెర‌కెక్కించాను. ఫ్రెండ్ షిప్ నేఫ‌థ్యంలోనే ఈ సినిమా తెర‌కెక్కింది. చిన్న స‌ర్ ప్రైజ్ కూడా ఉంటుంది సినిమా చూస్తే అర్థ‌మైపోతుంది. ఫ్లాష్ బ్యాక్ లు ఎన్ని ఉంటాయ‌నేది సినిమా చూసి తెలుసుకోండి. అని చెప్పారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aakanksha Singh
  • #Devadas
  • #Devadas Audio Launch
  • #DevaDas Movie
  • #Devadas Movie Review

Also Read

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

related news

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

Nagarjuna: నాగ్‌ 100.. మరో హీరోయిన్‌ కూడా ఫిక్స్‌.. మూడో హీరోయిన్‌ ఎవరు?

Nagarjuna: నాగ్‌ 100.. మరో హీరోయిన్‌ కూడా ఫిక్స్‌.. మూడో హీరోయిన్‌ ఎవరు?

The Paradise: ది ప్యారడైజ్.. ఒక్క ఫైట్ కోసమే రూ.5 కోట్లా?

The Paradise: ది ప్యారడైజ్.. ఒక్క ఫైట్ కోసమే రూ.5 కోట్లా?

Anil Ravipudi: నోరు జారిన అనిల్‌ రావిపూడి.. ఆ హీరోతో సినిమా ఫిక్స్‌ అయినట్లే

Anil Ravipudi: నోరు జారిన అనిల్‌ రావిపూడి.. ఆ హీరోతో సినిమా ఫిక్స్‌ అయినట్లే

Sreeleela: పవన్‌ని తెగ పొగిడేస్తున్న శ్రీలీల.. అచ్చంగా రష్మిక మందనలా చేస్తోందిగా!

Sreeleela: పవన్‌ని తెగ పొగిడేస్తున్న శ్రీలీల.. అచ్చంగా రష్మిక మందనలా చేస్తోందిగా!

trending news

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

5 hours ago
Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

23 hours ago
Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

1 day ago
Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

1 day ago

latest news

Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

1 min ago
Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

3 hours ago
Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

3 hours ago
Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

3 hours ago
Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version