ఎన్టీఆర్ (Jr NTR) , కొరటాల శివ (Koratala Siva) కాంబినేషన్లో ‘జనతా గ్యారేజ్’ (Janatha Garage) తర్వాత రూపొందిన చిత్రం ‘దేవర'(పార్ట్ 1) (Devara) . విడుదలై 25 రోజులు పూర్తి కావస్తున్నా ఈ సినిమా బాక్సాఫీస్ జోరు ఇంకా తగ్గలేదు.ఆల్రెడీ రూ.500 కోట్లు క్లబ్ లో చేరిన ఈ చిత్రం.. స్టడీ రన్ ను కంటిన్యూ చేస్తుంది. ‘దావూది’ సాంగ్ దసరా సెలవులకి యాడ్ చేయడం వల్ల కూడా ‘దేవర’ లాంగ్ రన్ కి హెల్ప్ అయినట్టు చెప్పవచ్చు. ఈ సినిమా మొదటి రోజు టాక్ బట్టి అయితే..
ఇప్పటివరకు నిలబడుతుంది అని ఎవ్వరూ అనుకోలేదు. టాక్ తో సంబంధం లేకుండా ఈ సినిమా భారీగా కలెక్ట్ చేస్తుంది. ‘దేవర’ (Devara) 25 రోజుల కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 58.10 cr |
సీడెడ్ | 30.18 cr |
ఉత్తరాంధ్ర | 17.22 cr |
ఈస్ట్ | 9.81 cr |
వెస్ట్ | 7.61 cr |
గుంటూరు | 12.11 cr |
కృష్ణా | 8.65 cr |
నెల్లూరు | 5.78 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 149.46 cr |
కర్ణాటక | 15.47 cr |
తమిళనాడు | 2.48 cr |
కేరళ | 0.76 cr |
నార్త్ | 27.87 cr |
ఓవర్సీస్ | 35.06 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 231.10 cr (షేర్) |
‘దేవర’ చిత్రానికి రూ.174.4 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.175 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 6 రోజులకే బ్రేక్ ఈవెన్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం 25 రోజులు పూర్తయ్యేసరికి రూ.231.1 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా రూ.56.1 కోట్ల వరకు ఓవరాల్ గా ప్రాఫిట్స్ అందించింది.