దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) హీరోగా మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary)హీరోయిన్ గా తెరకెక్కుతున్న చిత్రం ‘లక్కీ భాస్కర్’ (Lucky Baskhar) . వెంకీ అట్లూరి (Venky Atluri) ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ‘సార్’ (Sir) వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్లో అతను చేస్తున్న సినిమా కావడంతో ‘లక్కీ భాస్కర్’ పై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. జి వి ప్రకాష్ కుమార్ (G. V. Prakash Kumar) ఈ చిత్రానికి సంగీతం అందించాడు. ‘శ్రీమతి గారు’ అనే పాట కూడా చార్ట్ బస్టర్ అయ్యింది.
అక్టోబర్ 31 న ‘లక్కీ భాస్కర్’ దీపావళి కానుకగా రిలీజ్ కాబోతుంది. ఇక ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ట్రైలర్ ను కూడా వదిలారు : 2 నిమిషాల 30 నిడివి కలిగిన ఈ ట్రైలర్లో.. ‘లక్కీ భాస్కర్’ కథపై ఓ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు మేకర్స్. రూ.6000 జీతం కోసం ఒక బ్యాంకు ఉద్యోగిగా పనిచేసే భాస్కర్.. సుమతి అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. ఆ తర్వాత తన అవస్రతల కొరకు జీతం సరిపోక అప్పులు చేస్తుంటాడు.
అప్పు సరైన టైంలో తీర్చకపోవడంతో.. అప్పు ఇచ్చిన వాళ్ళు భాస్కర్ ఫ్యామిలీని నిత్యం వేధిస్తూ ఉంటారు. తన ఫ్యామిలీ ఫేస్ చేస్తున్న అవమానాలు తట్టుకోలేక భాస్కర్.. ఓ రిస్క్ చేస్తాడు. ఆ రిస్క్ చేయడం వల్ల అతనికి బోలెడంత డబ్బు వచ్చి పడుతుంది. అక్కడితో భాస్కర్ ఫ్యామిలీ పడుతున్న కష్టాలు తీరిపోయాయి అని సంతోషిస్తే..
కొత్త సమస్యలు వచ్చి పడతాయి. అయితే భాస్కర్ ఆ డబ్బుని ఎలా సంపాదించాడు? లాటరీ తగిలింది అని ఒకరి దగ్గర.. బిజినెస్ చేస్తున్నాను అని ఇంకొకరి దగ్గర చెబుతూ.. ఆ కారణాన్ని పక్కదోవ పట్టించి.. సినిమాపై క్యూరియాసిటీ క్రియేట్ అయ్యేలా ఈ ట్రైలర్ ను కట్ చేశారు. ట్రైలర్ అయితే బాగుంది. మీరు కూడా ఓ లుక్కేయండి :