Hari Hara Veeramallu: వీరమల్లు.. ఆ 20 నిమిషాలే అసలైన ఊచకోత!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తన ప్రతిష్టాత్మక చిత్రం ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu)  తో ప్రేక్షకులకు సరికొత్త సర్ ప్రైజ్ ఇవ్వనున్నాడు. ఈ పిరియాడిక్ డ్రామా ప్రాజెక్ట్‌పై మొదటి నుంచీ మంచి అంచనాలు ఉన్నాయి. షూటింగ్ ప్రారంభమై చాలా కాలమే అయినప్పటికీ, మధ్యలో కొన్నిసార్లు వాయిదా పడడం వల్ల విడుదల కూడా ఆలస్యమవుతోంది. కానీ ఇటీవల షూటింగ్ మళ్లీ ప్రారంభమై, మేకర్స్ వేగంగా షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నారు.

Hari Hara Veeramallu

పవన్ కూడా షూటింగ్‌లో ఎలాంటి విరామం లేకుండా పాల్గొంటూ, సినిమాను త్వరగా కంప్లీట్ చేయడానికి కృషి చేస్తున్నారు. తాజాగా ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veeramallu) చిత్రంలో 20 నిమిషాల హై ఓల్టేజ్ యాక్షన్ సీన్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోనుందని సమాచారం. సినిమా ఇంటర్వెల్ ముందు వచ్చే ఈ సీక్వెన్స్ మొత్తం సినిమాకు హైలైట్‌గా నిలవబోతోందట. ఈ సీన్‌ను చాలా ప్రత్యేకంగా తీర్చిదిద్దటానికి, ఏకంగా 40 రోజుల పాటు చిత్రీకరణ జరిగింది. అందుకు పవన్ కూడా ప్రత్యేకంగా మార్షల్ ఆర్ట్స్ శిక్షణ తీసుకోవడం, రిస్కీ స్టంట్లు చేయడం ఆసక్తికరమైన అంశాలు.

ఈ యాక్షన్ సీన్‌లో హాలీవుడ్ రేంజ్ విజువల్స్, బ్యాగ్రౌండ్ స్కోర్‌ను అందించారని, ఫిల్మ్ ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. మొగల్ సామ్రాజ్యం నేపథ్యంలో అద్భుతమైన గ్రాఫిక్స్‌తో ఈ సీన్‌ను రూపొందించడం వల్ల ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంటుందనే నమ్మకంతో మేకర్స్ ఉన్నారు. ఇకపోతే, ఈ భారీ పిరియాడిక్ డ్రామాలో పవన్ కల్యాణ్ కంటే ఎక్కువగా పలువురు స్టార్ నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఇందులో నిధి అగర్వాల్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. అంతేకాదు, బాలీవుడ్ ప్రముఖులు బాబీ డియోల్, అర్జున్ రాంపాల్ కూడా ఇందులో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి మ్యూజిక్ మాస్ట్రో ఎమ్‌ఎమ్ కీరవాణి స్వరాలు సమకూర్చుతున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ నిర్మాణంలో వస్తున్న ఈ భారీ చిత్రాన్ని 2025 మే 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

పుష్ప 2: డైరెక్ట్ గా జనంలోకి బన్నీ!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus