Devara: ఆ భాషలో సైతం అదరగొడుతున్న దేవర చుట్టమల్లే.. కానీ?

  • August 17, 2024 / 09:13 PM IST

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్  (Jr NTR) కొరటాల శివ (Koratala Siva) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న దేవర (Devara)  విడుదలకు సమయం దగ్గర పడే కొద్దీ ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన రెండు పాటలు ఒక పాటను మించి మరొకటి అలరించాయి. ఫియర్ సాంగ్ ప్రేక్షకులను మెప్పించగా చుట్టమల్లే సాంగ్ మాత్రం ఈ మధ్య కాలంలో అన్ని చోట్లా వినిపిస్తూ మ్యూజిక్ లవర్స్ ను ఎంతగానో మెప్పిస్తోంది.

Devara

ఈ సాంగ్ కు అన్ని భాషల్లో కలిపి ఇప్పటికే 100 మిలియన్లకు పైగా వ్యూస్ రాగా చుట్టమల్లే సాంగ్ తెలుగు, హిందీ వెర్షన్లకు మాత్రం అంచనాలకు మించి రెస్పాన్స్ వస్తోంది. తెలుగు వెర్షన్ కు ఇప్పటికే 70 మిలియన్లకు పైగా వ్యూస్ రాగా హిందీ వెర్షన్ కు 21 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. రాబోయే రోజుల్లో చుట్టమల్లే సాంగ్ మరిన్ని సంచలనాలను కొనసాగించే అవకాశాలు అయితే కచ్చితంగా ఉన్నాయని చెప్పవచ్చు. చుట్టమల్లే సాంగ్ ఇప్పటికీ యూట్యూబ్ లో నంబర్ 1 స్థానంలో ట్రెండింగ్ లో నిలుస్తుండటం కొసమెరుపు.

దేవర సినిమాలోని ప్రతి పాత్ర విషయంలో కొరటాల శివ ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారని సమాచారం అందుతోంది. దేవర సినిమా యాక్షన్ ప్రేక్షకులకు నచ్చేలా ఉండనుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. దేవర1 సక్సెస్ సాధిస్తే దేవర2 సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి. కొరటాల శివ సక్సెస్ సాధించాలన్న కసితో ఈ సినిమాను తెరకెక్కించారని కామెంట్లు వినిపిస్తున్నాయి.

జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కి కొన్నేళ్ల క్రితం థియేటర్లలో విడుదలైన జనతా గ్యారేజ్ (Janatha Garage) ప్రేక్షకులకు ఎంతగానో నచ్చగా దేవర సినిమా మాస్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు ఎంతగానో నచ్చేలా ఉంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. దేవర సినిమాకు సీక్వెల్ గా దేవర2 తెరకెక్కనుండగా ఈ సినిమా కోసం కొన్నేళ్ల పాటు ఎదురుచూపులు తప్పవని తెలుస్తోంది. ఎన్టీఆర్ సక్సెస్ ట్రాక్ ను దేవర కొనసాగించాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

సినిమా విజయం సాధించిన ఊపులో కొత్త అనౌన్స్‌మెంట్‌.. కానీ..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus