టాలీవుడ్ ఇండస్ట్రీని ప్రస్తుతం విలన్ల కొరత వేధిస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ హీరోలే టాలీవుడ్ ఇండస్ట్రీలో విలన్లుగా నటిస్తూ కెరీర్ పరంగా సత్తా చాటుతున్నారు. అయితే దేవర (Devara) సినిమాలో సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) పాత్ర చనిపోతుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే దేవర సీక్వెల్ లో బాబీ డియోల్ (Bobby Deol) విలన్ గా నటించనున్నారని సమాచారం అందుతోంది. ఈ మధ్య కాలంలో బాబీ డియోల్ వరుసగా తెలుగు సినిమాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే.
ఎన్టీఆర్ (Jr NTR) ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబో మూవీకి సంబంధించి కొంతకాలం క్రితం బాబీ డియోల్ పేరు విలన్ గా వినిపించింది. అయితే తారక్ నటిస్తున్న రెండు సినిమాలకు ఒకే విలన్ పేరు వినిపించడం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది. అయితే మేకర్స్ నుంచి క్లారిటీ వస్తే మాత్రమే వైరల్ అవుతున్న వార్తల్లో నిజానిజాలు తెలిసే అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చు.
దేవర సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వైరల్ అవుతున్న వార్తలకు సంబంధించి పూర్తిస్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. దర్శకుడు కొరటాల శివ (Koratala Siva) గత సినిమా ఆచార్య (Acharya) భారీ డిజాస్టర్ గా నిలిచిన నేపథ్యంలో కొరటాల శివ ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారని సమాచారం అందుతోంది. కొరటాల శివ ఏడాదికి పైగా ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ కోసం పని చేశారని తెలుస్తోంది.
దేవర సినిమా 300 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో తెరకెక్కగా బిజినెస్ పరంగా ఈ సినిమా అదరగొట్టింది. కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) ఈ సినిమా బిజినెస్ విషయంలో సంతృప్తితో ఉన్నారని సమాచారం అందుతోంది. దేవర సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. దేవర సీక్వెల్ కు సంబంధించి కొంత భాగం షూటింగ్ పూర్తైందని సమాచారం అందుతోంది.