పవన్ వీణ స్టెప్ కేక: దేవిశ్రీప్రసాద్

  • April 7, 2016 / 08:15 AM IST

సంగీత ప్రపంచంలో దేవిశ్రీప్రసాద్ పేరు వినని వారుండరు. సినిమా ఎలా ఉన్నా.. దేవి అందించిన పాటలు మాత్రం హైలైట్ గా నిలుస్తున్నాయి. తెలుగు ఇండస్ట్రీలో ఆయనకు మంచి క్రేజ్ ఉంది. ఎందరో హీరోలకు కూడా దేవి ఫేవరేట్ మ్యూజిక్ డైరెక్టర్. ప్రస్తుతం దేవి మ్యూజిక్ చేసిన ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమా రిలీజ్ అవుతుంది. ఇప్పటికే పవన్ హీరోగా నటించిన మూడు చిత్రాలకు దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ చేశాడు. పవన్ తో తనకిది నాల్గవ సినిమా.

అయితే పవన్ తో ఎన్ని సార్లు కలిసి వర్క్ చేసినా.. ఆ కిక్ చాలా కొత్తగా ఉంటుందని దేవిశ్రీప్రసాద్ అన్నాడు. పవన్ కు మెలోడీస్ బాగా ఇష్టమని, సర్దార్ లో ‘నీ చేపకళ్ళు’ అనే పాట బాగా నచ్చిందని చెప్పారు. అలానే పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో స్టెప్పులు ఇరగదీశారట.

సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వర్క్ చేస్తున్నప్పుడు ఆ స్టెప్పులు చూసి ఆశ్చర్య పోయాడట దేవి. ముఖ్యంగా వీణ స్టెప్ ప్రేక్షకులందరికీ నచ్చడం ఖాయమని.. పవన్ ఫ్యాన్స్ కు ఈ సినిమా పండగేనని చెప్పారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus