Devi Sri Prasad: దేవిశ్రీ పెళ్లి విషయంలో ఏజ్ జస్ట్ నెంబరే అంటున్న నెటిజన్లు!

  • August 8, 2023 / 12:09 AM IST

దేవి సినిమాతో సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టి.. దక్షిణాది భారతీయ సినీ చరిత్రలో తన మ్యూజిక్ తో ఉర్రూతలూగించారు డీఎస్పీ(దేవీ శ్రీ ప్రసాద్). వెంటనే వచ్చి ఆనందం సినిమా అతడి కెరీర్ ను మలుపు తిప్పంది. ఆ పాటలు ఆల్ టైం ఫేవరేట్. ఆ పాటల హిట్ తో తను కెరీర్లో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. సంగీతం అందించి ప్రతి సినిమా హిట్. కేవలం దేవిశ్రీప్రసాద్ పాటలతో హిట్ అయిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. అంతే కాకుండా తన మ్యూజిక్ అంటే ప్రాణం పెట్టేవారు చాలా మంది ఉన్నారు.

కొందరు దర్శకులకు దేవి శ్రీ ప్రసాద్ ఆస్థాన విద్వాంసుడు కూడా. దేవిశ్రీప్రసాద్ కెరియర్ లో నీకోసం, బొమ్మరిల్లు, ఖడ్గం, వర్షం, ఆర్య, గబ్బర్ సింగ్, సరినేరు నీకెవ్వరు, వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ సినిమాలకు తను కంపోజ్ చేశారు. అతను ఒక మ్యూజిక్ డైరెక్టర్ మాత్రమే కాదు… రచయిత, సింగర్, డ్యాన్సర్, యాక్టర్ ఇలా ఎన్నో టాలెంట్లు ఉన్న వ్యక్తి. ప్రొఫెషనల్ లైఫ్ చాలా గొప్పగా ఉన్నప్పటికీ దేవి శ్రీ ప్రసాద్ పర్సనల్ లైఫ్ మాత్రం ఆశించిన స్థాయిలో లేదనే చెప్పాలి.

కారణం నాలుగు పదులు దాటినా దేవి ఇంకా పెళ్లి చేసుకోలేదు. గతంలో ఓ స్టార్ హీరోయిన్ తో ప్రేమాయణం సాగిస్తున్నారని.. పెళ్లి పీటలు కూడా ఎక్కనున్నారని టాక్ వచ్చింది. ఇప్పుడు కూడా మరొకసారి దేవి శ్రీ ప్రసాద్ పెళ్లి చేసుకుంటున్నారంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన పుష్ప సినిమా గుర్తుందా.. అందులో సమంత నర్తించిన ఊ అంటావా మావ.. ఉ ఊ అంటావా మావా అనే పాట దేశాన్ని ఎంతలా ఊపేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఈ పాట పాడిన గాయని ఇంద్రావతి ఓవర్ నైట్ స్టార్ సింగర్ అయిపోయింది. ఆమె మరెవరో కాదు మంగ్లీ చెల్లెలు. తను దేవిశ్రీప్రసాద్ కొన్ని ఫోటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేసింది. తాను షేర్ చేసిన కొన్ని సెకండ్లలోనే వైరల్ అయిపోయాయి. ఇవి చూసిన కొంతమంది నెటిజన్లు పలు రకాల కామెంట్స్ చేస్తున్నారు. ఈ జంట చూడడానికి చాలా బాగుంది.. ఏజ్ జస్ట్ నెంబరే అంటూ వీరిద్దరూ గురించి పెళ్లి వార్తను వైరల్ చేస్తున్నారు. ఎప్పటికైనా ఇంద్రావతి ఈ మ్యూజిక్ (Devi Sri Prasad) డైరెక్టర్‎నే పెళ్లి చేసుకోబోతుంది అనే వార్త వైరల్ అవుతోంది.

ఆ హీరోల భార్యల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

రాంచరణ్ టు నాని.. ఈ 10 మంది హీరోలకి మొదటి వంద కోట్ల సినిమాలు ఇవే..!
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus