Devil First Review: ‘డెవిల్’ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

  • December 28, 2023 / 08:16 PM IST

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందిన లేటెస్ట్ మూవీ ‘డెవిల్’. ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ అనేది ఈ సినిమా ట్యాగ్ లైన్. సంయుక్తా మీనన్, మాళవికా నాయర్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాని ‘అభిషేక్ పిక్చ‌ర్స్’ బ్యాన‌ర్‌పై అభిషేక్ నామా నిర్మించడమే కాకుండా డైరెక్షన్ కూడా చేసినట్లు పేరు వేసుకోవడం విశేషం. ఇక డిసెంబ‌ర్ 29న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది ‘డెవిల్’ మూవీ. టీజర్, ట్రైలర్స్ బాగానే అనిపించాయి.

కళ్యాణ్ రామ్ కెరీర్లో ఇప్పటివరకు హయ్యెస్ట్ బడ్జెట్ తో రూపొందిన సినిమాగా ‘బింబిసార’ నిలిచింది. అయితే ‘డెవిల్’ కి అంతకు మించిన బడ్జెట్ అయినట్టు నిర్మాత అభిషేక్ నామా తెలిపారు. ఇదిలా ఉండగా.. ‘డెవిల్’ చిత్రాన్ని ఇండస్ట్రీలో కొంతమంది పెద్దలకి స్పెషల్ షో వేయడం జరిగింది. వారి టాక్ ప్రకారం.. సినిమా ఫస్ట్ హాఫ్ బాగానే ఉంటుందట. ఇంటర్వెల్ ట్విస్ట్ పెద్ద షాక్ ఇస్తుంది అంటున్నారు. సెకండ్ హాఫ్ లో కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ ఆకట్టుకుంటాయట.

కానీ కనెక్టివిటీ మిస్ అయిన ఫీలింగ్ కలగడం వల్ల కొంత ల్యాగ్ అనిపించింది అంటున్నారు. చాలా వరకు అనవసరపు సన్నివేశాలు కూడా ఉన్నాయట. నిర్మాత అభిషేక్ నామా చెప్పినట్టు ఇది రూ.100 కోట్ల గ్రాస్ సినిమా అయ్యే అవకాశం లేదని వారు అంటున్నారు. అయితే ఒకసారి చేసే విధంగా అయితే (Devil) ‘డెవిల్’ ఉందట. మరి రిలీజ్ రోజున మార్నింగ్ షోలు ముగిశాక ఎలాంటి టాక్ వస్తుందో చూడాలి

సలార్ సినిమా రివ్యూ & రేటింగ్!

డంకీ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిల్లా- రంగా’ టు ‘సలార్’… ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus