Dunki Review in Telugu: డంకీ సినిమా రివ్యూ & రేటింగ్!

  • December 21, 2023 / 12:48 PM IST

Cast & Crew

  • షారుక్ ఖాన్ (Hero)
  • తాప్సి (Heroine)
  • విక్కీ కౌశల్, బోమన్ ఇరానీ (Cast)
  • రాజ్ కుమార్ హిరానీ (Director)
  • గౌరీఖాన్ - రాజ్ కుమార్ హిరానీ - జ్యోతి దేశ్ పాండే (Producer)
  • ప్రీతమ్ - అమన్ పంత్ (Music)
  • సి.కె.మురళీధరన్ - మనుష్ నందన్ - అమిత్ రాయ్ - కుమార్ పంకజ్ (Cinematography)

“పఠాన్, జవాన్” సినిమాలతో వరుసపెట్టి వెయ్యి కోట్ల రూపాయల విజయాలు సాధించి బాలీవుడ్ లో మళ్ళీ తన సత్తాను చాటుకున్న షారుక్ ఖాన్ హీరోగా తెరకెక్కగా ఈ ఏడాది విడుదలైన మూడో చిత్రం “డంకీ”. “3 ఇడియట్స్, సంజు” తదితర చిత్రాలతో దర్శకుడిగా మహోన్నత స్థాయిని అందుకున్న రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో ఈ చిత్రంపై ఎనౌన్స్ మెంట్ టైమ్ నుండి భారీ అంచనాలున్నాయి. మరి ఆ అంచనాలను షారుక్ & రాజ్ కుమార్ హిరానీ అందుకోగలిగారా? ముఖ్యంగా బాక్సాఫీస్ పై డైనోసార్ గా దాడి చేయనున్న “సలార్” ముందు నిలబడే సత్తా ఉందా అనేది చూద్దాం..!!

కథ: తనను బ్రతికించిన వ్యక్తిని ఒకసారి కలిసి.. అతడి టేప్ రికార్డర్ ఇచ్చేద్దామని పఠాన్ కోట్ నుండి పంజాబ్ లోని లల్టు అనే గ్రామానికి వస్తాడు హృదయ్ సింగ్ అలియాస్ హార్డీ (షారుక్ ఖాన్). అయితే.. ఆ వ్యక్తి చనిపోయాడని తెలుసుకొని అతడి చెల్లెలు మను (తాప్సి) కల అయిన లండన్ వెళ్ళడానికి సహాయపడాలనుకుంటాడు.

ఎన్ని తిప్పలు పడినా వీసా రాకపోవడంతో.. ఆఖరికి దొంగతనంగా లండన్ చేరాలనుకుంటారు. అందుకోసం వాళ్ళు పడిన తిప్పలు, బాధల సమాహారమే “డంకీ” చిత్రం.

నటీనటుల పనితీరు: షారుక్ ఖాన్ ఎప్పట్లానే హార్డీ పాత్రను తన భుజాలపై మోసుకొని వెళ్ళాడు. అయితే.. ఆ పాత్రలో ఎమోషన్ ఎక్కడా వర్కవుటవ్వలేదు. విక్కీ కౌశల్ చిన్న పాత్రలో అద్భుతంగా నటించినప్పటికీ అతడి పాత్ర పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది. తాప్సి నటిగా ఈ సినిమాకి ఎలాంటి వేల్యూ యాడ్ చేయలేకపోయింది. షారుక్ తో ఆమె కెమిస్ట్రీ కూడా సరిగా పండలేదు. బోమన్ ఇరానీ తదితరులకు సరైన పాత్రలు లభించలేదు.

సాంకేతికవర్గం పనితీరు: షారుక్ & హిరానీ కెరీర్లలో అత్యంత తక్కువస్థాయి క్వాలిటీ సినిమాగా “డంకీ” ఎప్పటికీ నిలిచిపోతుంది. కొన్ని సన్నివేశాల్లో గ్రాఫిక్స్ చూస్తే ఇది నిజంగానే 120 కోట్ల రూపాయల సినిమానా అనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ వర్క్ కూడా బాలీవుడ్ స్థాయిలో లేదు. నేపధ్య సంగీతం కూడా ఎమోషనల్ కంటెంట్ కి వర్కవుటవ్వలేదు. ప్రీతమ్ పాటలు మాత్రం బాగున్నాయి.

దర్శకుడిగా రాజ్ కుమార్ హిరానీ స్థాయికి తగ్గ సినిమా కాదు ఇది. ఆయన తెరకెక్కించిన మునుపటి చిత్రాలు కరడుగట్టిన క్రిమినల్స్ తో కూడా కన్నీరు పెట్టిస్తాయి. కానీ.. “డంకీ”లో అలా కన్నీరు పెట్టించే మూమెంట్ ఒక్కటంటే ఒక్కటి కూడా లేకపోవడం పెద్ద మైనస్. అలాగే.. కథనం సినిమాకి మరో మైనస్ గా నిలిచింది. చాలా చిన్న పాయింట్ ను ఎమోషనల్ గా కనెక్ట్ చేయడంలో రచయితలు దారుణంగా విఫలమయ్యారు. ఈ సినిమా యూనిట్ లో విధు వినోద్ చోప్రా లేని లోటు స్పష్టంగా కనిపిస్తుంది.

విశ్లేషణ: షారుక్ & రాజ్ కుమార్ హిరానీ కాంబినేషన్ కదా అని భారీ అంచనాలతో థియేటర్ కి వెళ్తే మాత్రం నిరాశపడతారు. కాకపొతే.. హిరానీ మార్క్ కామెడీ & పాటలు కాస్తంత బాగున్నాయి కాబట్టి.. ఓపిగ్గా ఒకసారి చూడొచ్చు. కానీ.. “సలార్” ముందు ఈ చిత్రం నిలదొక్కుకోవడం మాత్రం కష్టం.

రేటింగ్: 1.5/5

Click Here To Read In ENGLISH

Rating

1.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus