‘బిల్లా- రంగా’ టు ‘సలార్’… ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన 10 సినిమాల లిస్ట్..!

ఫ్రెండ్షిప్ నేపథ్యంలో ఇప్పటివరకు చాలా సినిమాలు వచ్చాయి. అందులో కొన్ని మంచి సక్సెస్ అందుకున్నాయి. ఇంకొన్ని ఆడలేదు. అయితే ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ సినిమాలు వచ్చిన సందర్భాలు అరుదు. ఇద్దరు హీరోలు ఓ సినిమాలో ఫ్రెండ్స్ గా నటించి.. ఒకరంటే ఇంకొకరు ప్రాణంగా కలిసుండి.. కొన్ని సమస్యల వల్ల విడిపోయి బద్ద శత్రువులుగా మారిపోవడం, లేదు అంటే మొదట శత్రువులుగా ఉండి తర్వాత కలిసిపోవడం..లేదంటే చివరికి ఒకరు చనిపోవడం, ఈ ట్రాజెడీకి యాక్షన్ జోనర్ ని జోడించి ఇంట్రెస్టింగ్ గా ప్రజెంట్ చేసిన సినిమాలు తక్కువే అని చెప్పాలి. అయితే ఇది అందరికీ ఇంట్రెస్టింగ్ గా అనిపించే జోనర్ అని చెప్పాలి. ఇలా ఫ్రెండ్షిప్ నేపథ్యంలో వచ్చిన యాక్షన్ సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

1) బిల్లా రంగా :

మెగాస్టార్ చిరంజీవి, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు..లు బెస్ట్ ఫ్రెండ్స్ గా నటించిన ఈ యాక్షన్ సినిమాని కె.ఎస్.ఆర్ దాస్ డైరెక్ట్ చేశారు. ఈ సినిమా బాగానే ఆడింది.

2) కొండపల్లి రాజా :

విక్టరీ వెంకటేష్, సుమన్..లు బెస్ట్ ఫ్రెండ్స్ గా నటించిన ఈ మాస్ అండ్ యాక్షన్ మూవీకి రవిరాజా పినిశెట్టి దర్శకుడు. ఈ సినిమా కూడా బాగానే ఆడింది.

3) దళపతి :

రజినీకాంత్, మమ్ముట్టి..లు బెస్ట్ ఫ్రెండ్స్ గా నటించిన ఈ యాక్షన్ డ్రామాకి మణిరత్నం దర్శకుడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ఇంకా చెప్పాలంటే ఈ సినిమా ఒక క్లాసిక్ అనే చెప్పాలి.

4) హనుమాన్ జంక్షన్ :

యాక్షన్ కింగ్ అర్జున్, జగపతి బాబు..లు బెస్ట్ ఫ్రెండ్స్ గా నటించిన ఈ కామెడీ అండ్ యాక్షన్ మూవీకి మోహన్ రాజా దర్శకుడు. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.

5) మహానంది :

హీరోలు.. సుమంత్, శ్రీహరి బెస్ట్ ఫ్రెండ్స్ గా నటించిన ఈ మాస్ అండ్ యాక్షన్ మూవీకి వి.సముద్ర దర్శకుడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ ఫలితంతో సరిపెట్టుకుంది.

6) దేవదాస్ :

అక్కినేని నాగార్జున, నేచురల్ స్టార్ నాని బెస్ట్ ఫ్రెండ్స్ గా నటించిన ఈ యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ కి శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్లాప్ గా మిగిలింది.

7) సైరా నరసింహారెడ్డి :

మెగాస్టార్ చిరంజీవి, కిచ్చా సుదీప్ … బెస్ట్ ఫ్రెండ్స్ గా నటించిన ఈ పిరియాడికల్ మూవీకి సురేందర్ రెడ్డి దర్శకుడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ ఫలితాన్ని అందుకుంది.

8) మహాసముద్రం :

శర్వానంద్, సిద్దార్థ్ బెస్ట్ ఫ్రెండ్స్ గా నటించిన ఈ యాక్షన్ డ్రామాకి అజయ్ భూపతి దర్శకుడు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది.

9) ఆర్.ఆర్.ఆర్ :

మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ .. బెస్ట్ ఫ్రెండ్స్ గా నటించిన ఈ పీరియాడికల్ యాక్షన్ మూవీకి ఎస్.ఎస్.రాజమౌళి దర్శకుడు. ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.

10) సలార్ :

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ బెస్ట్ ఫ్రెండ్స్ గా నటించిన ఈ హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాకి ప్రశాంత్ నీల్ దర్శకుడు.డిసెంబర్ 22న ‘సలార్’ రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. మరి ఈ సినిమా  (Salaar) ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus