Devil: ఆ విషయంలో టెంపర్ ను ఫాలో అవుతున్న్ డెవిల్.. ఏమైందంటే?

  • December 28, 2023 / 07:15 PM IST

మరికొన్ని గంటల్లో కళ్యాణ్ రామ్ డెవిల్ మూవీ థియేటర్లలో విడుదల కానుంది. ఈ ఏడాది బాలయ్య భగవంత్ కేసరి సినిమాతో సక్సెస్ ను సొంతం చేసుకోగా కళ్యాణ్ రామ్ డెవిల్ సినిమాతో సక్సెస్ ను అందుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. టెంపర్ సినిమా క్లైమాక్స్ లో ఎలాంటి ట్విస్ట్ ఉంటుందో డెవిల్ మూవీ క్లైమాక్స్ లో ట్విస్ట్ కూడా అదే విధంగా ఉండబోతుందని సమాచారం అందుతోంది. క్లైమాక్స్ ట్విస్ట్ డెవిల్ కు హైలెట్ గా నిలుస్తుందని కళ్యాణ్ రామ్ చెబుతున్నారు.

కళ్యాణ్ రామ్ పాత్రకు సంబంధించిన మరో కోణాన్ని పరిచయం చేస్తూ ఆ ట్విస్ట్ ఉండబోతుందని సమాచారం అందుతోంది. సీడెడ్ లో ఈ సినిమాకు బుకింగ్స్ ఒకింత ఆలస్యంగా మొదలయ్యాయి. డెవిల్ మూవీ ఒకింత భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. అమెజాన్ ప్రైమ్ ఈ సినిమా డిజిటల్ హక్కులను కొనుగోలు చేసిందని సమాచారం అందుతోంది. డెవిల్ మూవీ పైసా వసూల్ ఎంటర్టైనర్ అని కళ్యాణ్ రామ్ చెబుతున్నారు.

డెవిల్ (Devil) పక్కా ఫిక్షనల్ మూవీ అని ఆయన వెల్లడించారు. డెవిల్ సినిమాపై కళ్యాణ్ రామ్ పూర్తిస్థాయిలో కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. డెవిల్ మూవీ రికార్డులను క్రియేట్ చేస్తుందో లేదో చూడాలి. కళ్యాణ్ రామ్ ఈ సినిమాతో కచ్చితంగా సక్సెస్ సాధించాల్సి ఉంది. అమిగోస్ మూవీ ప్రేక్షకులను నిరాశ పరచగా డెవిల్ మూవీ మాత్రం నిరాశపరచదని కళ్యాణ్ రామ్ పూర్తిస్థాయిలో కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.

అభిషేక్ నామా ఈ సినిమాతో సక్సెస్ సాధిస్తే దర్శకునిగా కూడా బిజీ అయ్యే అవకాశం ఉంది. అభిషేక్ నామా భవిష్యత్తులో ఒక పాన్ ఇండియా ప్రాజెక్ట్ కు డైరెక్టర్ గా వ్యవహరిస్తానని తాజాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. డెవిల్ సినిమా కలెక్షన్ల విషయంలో ఏ రేంజ్ లో సత్తా చాటుతుందో చూడాలి. డెవిల్ సినిమా వైజాగ్ హక్కులను దిల్ రాజు సొంతం చేసుకున్నారు. డెవిల్ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తుందేమో చూడాల్సి ఉంది.

సలార్ సినిమా రివ్యూ & రేటింగ్!

డంకీ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిల్లా- రంగా’ టు ‘సలార్’… ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus