దేవినేని నెహ్రూ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ‘దేవినేని’ ఫస్ట్ షెడ్యూల్ పూర్తి..!!

  • May 28, 2019 / 03:53 PM IST

ప్రముఖ రాజకీయ నాయకుడు దేవినేని నెహ్రు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘దేవినేని’. ‘బెజవాడ సింహం’ అన్నది ఉపశీర్షిక.

నందమూరి తారకరత్న టైటిల్ రోల్ లో నటిస్తుండగా నర్రా శివ నాగేశ్వరరావు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఆర్.టి.ఆర్ ఫిలింస్ పతాకంపై రాము రాథోడ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.. బెజవాడలో ఇద్దరు మహనాయకుల మధ్య స్నేహం, వైరం తో పాటు కుటుంబనేపథ్యంలో సెంటిమెంట్ ను జోడిస్తూ నడిచే ఈ సినిమాలో బెజవాడ లోని మరో సీనియర్ ప్రజా నాయకుడు వంగవీటి రాధ పాత్రలో నటుడు బెనర్జీ నటిస్తుండగా, చలసాని వెంకటరత్నం పాత్రలో తుమ్మల ప్రసన్న కుమార్ నటిస్తున్నారు.. షూటింగ్ షేరవేగంగా నటిస్తున్న ఈ సినిమా తాజాగా మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది..

ఈ సందర్భంగా దర్శకుడు నర్రా శివ నాగేశ్వర రావ్ మాట్లాడుతూ వంగవీటి రంగా పాత్రలో ప్రముఖ వ్యక్తి నటించనున్నారు.. వంగవిటి రాధ పాత్రతో బెనర్జీ ఈ చిత్రంలో చేసిన అందరు నటీనటులు చాలా బాగా నటించారు.. ముఖ్యంగా చలసాని వెంకటరత్నం పాత్రలో తుమ్మల ప్రసన్న కుమార్ అద్భుతమైన నటన కనపరిచారు.. వెంకటరత్నం మళ్లీ పుట్టారా అనిపించేలా ఆయన నటన కొనసాగింది.. నందమూరి తారక రత్న నిజమైన దేవినేని నెహ్రూ లో పరకాయ ప్రవేశం చేసినట్లు నటించడం మరో విశేషం అన్నారు.

నిర్మాత రాము రాథోడ్ మాట్లాడుతూ.. 1977 దేవినేని నెహ్రూ స్టూడెంట్ లైఫ్ లో జై ఆంధ్ర యా స్టేషన్ నుంచి ప్రారంభమైన ఈ చిత్రంలో ఆనాటి వాతావరణాన్ని ప్రతిబింబిస్తూ ఆంద్రప్రదేశ్ లో పలుచోట్ల షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం మొదటి షెడ్యూల్ షూటింగ్ పూర్తయ్యింది.. అందరూ నటీనటులు చాలా బాగా నటించారు. అన్నారు..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus