Surekha Vani: సురేఖ వాణి పర్సనల్ వీడియో లీక్.. లీగల్ యాక్షన్ తీసుకుంటా అంటూ?

సీనియర్ నటి సురేఖ వాణి (Surekha Vani) సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక విషయంతో హాట్ టాపిక్ అవుతూనే ఉంటారు. ముఖ్యంగా తన కూతురు సుప్రీతతో కలిసి డ్యాన్స్ రీల్స్ చేస్తూ, అలాగే తన లేటెస్ట్ ఫోటోషూట్‌లకు సంబంధించిన గ్లామరస్ ఫోటోలను పంచుకుంటూ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటారు. 2019లో తన భర్త అనారోగ్యంతో మరణించినప్పటి నుంచి సురేఖ వాణి తన కూతురితోనే కలిసి జీవిస్తున్నారు. కూతురే తన సర్వస్వం అన్నట్లుగా ఆమె జీవితం కొనసాగుతోంది.

Surekha Vani

వీరిద్దరూ తరచుగా విదేశాలకు సైతం వెకేషన్ల నిమిత్తం వెళ్లి, అక్కడి అందమైన లొకేషన్లలో దిగిన ఫోటోలను, వీడియోలను తమ అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటారు. సోషల్ మీడియాలో వీరికి ఉన్న భారీ ఫాలోయింగ్ చూసి, పలు బ్రాండ్స్, కార్పొరేట్ సంస్థలు కూడా తమ ఉత్పత్తులను ప్రమోట్ చేయడానికి వీరిని సంప్రదిస్తుంటాయి. ఈ ప్రమోషన్స్ ద్వారా వీరు లక్షల్లో ఆదాయం కూడా గడిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. తాజాగా సురేఖ వాణికి (Surekha Vani) సంబంధించిన ఓ పర్సనల్ వీడియో ఆన్‌లైన్‌లో బయటకు రావడం తీవ్ర కలకలం రేపింది. నెట్టింట ప్రత్యక్షమైన కొద్దిసేపటికే ఈ వీడియో విపరీతంగా వైరల్ అయ్యింది. మొదట ఈ వీడియో చూసిన వారంతా ఇది డీప్ ఫేక్ లేదా ఏఐ(AI) సాయంతో క్రియేట్ చేసిన నకిలీ వీడియో అని అనుకున్నారు. కానీ మరికొంతమంది ఆ వీడియోను స్వయంగా సురేఖ వాణియే తన అకౌంట్ ద్వారా షేర్ చేసినట్లుగా స్క్రీన్ షాట్స్ తో సహా బయటపెట్టారు.

ఆ తర్వాత ఈ వ్యవహారంపై సురేఖ వాణి (Surekha Vani) సైతం స్పందించింది. ఈ వీడియో లీక్ అయిన విషయాన్ని అంగీకరిస్తూనే, తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా హ్యాక్ అయ్యిందని ఆమె వివరణ ఇచ్చింది. ఆ పర్సనల్ వీడియోను ఉద్దేశపూర్వకంగా ఎవరైనా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో షేర్ చేసి, దాన్ని మరింత వైరల్ చేస్తే మాత్రం యాక్షన్ తీసుకుంటానని ఆమె తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. అయితే, సురేఖ వాణి వార్నింగ్ ఇచ్చే సమయానికే ఆ వీడియోను చాలామంది నెటిజన్లు డౌన్‌లోడ్ చేసి, ఇతర గ్రూపుల్లో షేర్ చేయడంతో అది అప్పటికే నెట్టింట విపరీతంగా చక్కర్లు కొట్టింది.

 

మొదటి వారం కేవలం 35 శాతం రికవరీ సాధించిన ‘కల్ట్’

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus