“దేవుడే దిగి వచ్చినా” హిట్ ని ఆపలేడు..!!

  • June 27, 2016 / 05:32 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ మధ్య ఓ ఇంటర్వ్యూ లో చెప్పినట్లుగానే వేగంగా సినిమాలు చేసేందుకు ఆసక్తిగా ఉన్నారు. తమిళం లో సూపర్ హిట్ సాధించించిన “అజయ్ వీరమ్” చిత్రాన్ని”హుషారు”గా రీమేక్ చేయడానికి అంతా  సిద్ధమయింది. వచ్చే నెల నుంచి ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది. గోపాల గోపాల దర్శకుడు డాలి మరోసారి పవన్ ను డైరక్ట్ చేయనున్నాడు.

ఆయన ఈ సినిమాను అక్టోబర్ నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో రంగం లోకి దిగుతున్నాడు. ఈ పనుల్లో బిజీగా ఉన్న పవర్ స్టార్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో మూడో సారి కలిసి పని చేయడానికి పచ్చజెండా ఊపారు. వీరిద్దరి కాంబినేషన్లో  వఛ్చిన జల్సా, అత్తారింటికి దారేది సినిమాలు హిట్ కావడంతో మూడో సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. నవంబర్ నుంచి సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాకు పేరు ఒకే అయినట్లు తెలిసింది.

“దేవుడే దిగి వచ్చినా” అనే టైటిల్ ని ఖరారు చేసినట్లు సమాచారం. తన సినిమాలకు అందమైన తెలుగు పేర్లను పెట్టే త్రివిక్రమ్ ఈ సినిమాకు కూడా చక్కని టైటిల్ ని సూచించారని సినీ వర్గాలు తెలిపాయి. పవన్, త్రివిక్రమ్ కాంబినేషన్లో రానున్న ఈ సినిమా హిట్ ని  “దేవుడే దిగి వచ్చినా”  ఆపలేడని పవన్ అభిమానులు ధీమాగా చెబుతున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus