రవితేజ గతేడాది ‘ఖిలాడి’ ‘రామారావు ఆన్ డ్యూటీ’ వంటి డిజాస్టర్లు ఫేస్ చేశాడు. అయితే ‘ధమాకా’ ‘ వాల్తేరు వీరయ్య’ వంటి బ్లాక్ బస్టర్లతో వెంటనే బౌన్స్ బ్యాక్ అయ్యాడు. ఇక అతి త్వరలోనే ‘రావణాసుర’ అనే మూవీతో కూడా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు రవితేజ. సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 7న విడుదల కాబోతోంది. 3 నెలల గ్యాప్ లోనే రవితేజ మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుండడంతో ‘రావణాసుర’ పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.
ఈ క్రమంలో రవితేజ ‘ధమాకా’ చిత్రానికి వాడిన టెక్నిక్ నే ‘రావణాసుర’ కి కూడా వాడబోతున్నాడట. అదేంటి అంటే..! సాధారణంగా రవితేజ తన సినిమాలను పెద్ద ఎత్తున ప్రమోషన్ చెయ్యడు. కంటెంట్ బాగుంటే బ్లాక్ బస్టర్ అదే అవుతుంది అని వదిలేస్తాడు. కానీ ‘ధమాకా’ తో తన రూటు మార్చాడు. ఆ సినిమాని ఎన్నడూ లేని విధంగా ఓ రేంజ్లో ప్రమోట్ చేశాడు. ఫలితంగా ఆ సినిమాకి యావరేజ్ టాక్ వచ్చినా డబుల్ బ్లాక్ బస్టర్ అయ్యింది.
రవితేజ కెరీర్లోనే ఆ మూవీ హయ్యెస్ట్ కలెక్షన్స్ ను సాధించింది. అందుకే ఇప్పుడు ఇదే ఫార్ములాని ‘రావణాసుర’ కి వాడబోతున్నాడు. ఆల్రెడీ టీజర్ రిలీజ్ అయ్యింది. కానీ అది రవితేజ అభిమానులను పెద్దగా ఆకర్షించలేదు. కానీ ఒక పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే అది సరిపోదు.
అందుకే రవితేజ వరుసగా ప్రమోషన్లు చేయడానికి రెడీ అయిపోయాడు. ఉగాది రోజు నుండి నాన్ స్టాప్ గా 2 వారాల పాటు ఈ చిత్రాన్ని ప్రమోట్ చేయబోతున్నాడు. మరి ఈసారి రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.