Dhanush: ఫస్ట్ ఫిలిం ఫ్లాఫ్ ఇచ్చిన డైరెక్టర్‌కి ధనుష్ సినిమాతో ఛాన్స్ ఇస్తున్న టాప్ ప్రొడ్యూసర్!

  • January 10, 2023 / 08:18 PM IST

ఒక భాషలో హిట్ అయిన సినిమా మరో భాషలో రీమేక్ చేయడం.. లేదా డబ్ చేసి రిలీజ్ చేయడం.. ఒక భాషకు చెందిన నటీనటులు ఇతర భాషల్లో నటించడం అనేది ఫిలిం ఇండస్ట్రీలో సర్వ సాధారణమే. విలన్లు, హీరోయిన్లు, కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు తప్ప స్టార్స్ ఎవరూ ఇతర భాషలో నటించిన ధాఖలాలు చాలా అంటే చాలా తక్కువ. ఇదంతా ఒకప్పుడు.. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి.. స్టార్స్ ఆలోచనలు, మేకర్స్ ప్లానింగులు, సినిమాల క్యాలిక్యులేషన్స్ కూడా మారాయి..

స్టార్ హీరోలు కూడా పొరుగు పరిశ్రమలోకి ఎంటర్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మార్కెట్‌తో పాటు స్టార్‌‌డమ్‌ని కూడా మరింత పెంచుకోవాలని ఆశ పడుతున్నారు. బాల చందర్, కె.ఎస్.రవి కుమార్, భారతీ రాజా, మురగదాస్, ఎస్.జె.సూర్య, కరుణాకరన్, లింగుస్వామి, వెంకట్ ప్రభు వంటి పలువురు తమిళ దర్శకులు తెలుగులో సినిమాలు చేయడం చూశాం. ఇప్పుడు కోలీవుడ్ హీరోలు టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు,

ఇళయ దళపతి విజయ్‌ని తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ ‘వారసుడు’ చేశారు. డైరెక్టర్ శంకర్‌తో కూడా తెలుగులో సినిమా చేస్తున్నారు. అలాగే తమిళ విలక్షణ నటుడు ధనుష్ కూడా వెంకీ అట్లూరి ‘సార్’ మూవీతో టాలీవుడ్‌కి ఇంట్రడ్యూస్ అవుతున్నారు. ఫిబ్రవరి 17న ఈ సినిమా భారీ స్థాయిలో విడుదల కానుంది. ఇంతకుముందే ధనుష్ – సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల కాంబినేషన్‌లో సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు ముచ్చటగా మూడో తెలుగు సినిమా కూడా ఫిక్స్ అయిందని సమాచారం. శర్వానంద్ ‘శ్రీకారం’ తో దర్శకుడిగా పరిచయమైన కిషోర్ రెడ్డి దర్శకత్వంలో, దిల్ రాజు ఓ ప్రాజెక్ట్ సెట్ చేస్తున్నారట. ఆసక్తికర కథ, కథనాలతో డైరెక్టర్ స్క్రిప్ట్ పకడ్బందీగా తయారు చేశాడని, త్వరలో అధికారికంగా ప్రకటించే అవకాశముందని అంటున్నారు. దీనితో పాటు ధనుష్ నటించబోయే మరో రెండు చిత్రాలు చర్చల దశలో ఉన్నాయి.

8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!

రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus