Sir Teaser: రూటు మార్చిన వెంకీ అట్లూరి.. టీజర్ బాగుంది..!

ధ‌నుష్‌, సంయుక్తా మీన‌న్‌ హీరో హీరోయిన్లుగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ద్విభాషా చిత్రం ‘సార్’. ‘సితార ఎంటర్‌టైన్‌మెంట్స్’ బ్యానర్ పై శ్రీమతి సాయి సౌజన్య (ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్) తో కలసి సూర్యదేవర నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ చిత్ర నిర్మాణ సంస్థ కూడా ఈ చిత్రాన్ని సమర్పిస్తుండడం విశేషం. ఇక దర్శకుడు వెంకీ అట్లూరి ఇప్పటివరకు తీసిన మూడు సినిమాలు ప్రేమ కథలే..!

‘ఈ మూడు సినిమాల్లోనూ ఫస్ట్ హాఫ్ ను చూసుకుంటే హీరో వెంట హీరోయిన్ పడుతుంది. సెకండ్ హాఫ్ ను చూసుకుంటే హీరోయిన్ వెంట హీరో పడతాడు’ అన్నట్టు ఉంటాయి. కానీ ధనుష్ తో చేయబోయే చిత్రానికి కంప్లీట్ గా తన కంఫర్ట్ జోన్ నుండి బయటకు వచ్చాడు దర్శకుడు వెంకీ అట్లూరి.

విద్యావ్యవస్థలో ఉన్న చీకటి కోణాలను వెలికి తీస్తూ.. కమర్షియల్ హంగులతో, ఎమోషనల్ మరియు యాక్షన్ ఎంటర్టైనర్ గా చిన్నపాటి మెసేజ్ తో ఈ చిత్రాన్ని వెంకీ తెరకెక్కిస్తున్నట్లు స్పష్టమవుతుంది.

“సార్… మై సెల్ఫ్
బాల గంగాధర్ తిలక్
త్రిపాఠి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ లో జూనియర్ లెక్చరర్..
అంటూ ఇందులో మనకు కనిపించే ‘సార్’
“విద్య అనేది గుడిలో దేవుడికి పెట్టే
నైవేద్యం తో సమానం. పంచండి …
ఫైవ్ స్టార్ హోటల్లో డిష్ లాగా అమ్మకండి” అంటూ ధనుష్ పలికిన డైలాగ్స్ బాగున్నాయి. జివి ప్రకాష్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకి హైలెట్ గా నిలిచింది అని చెప్పొచ్చు.

అక్టోబర్ లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. టీజర్ ను మీరు కూడా ఓ లుక్కేయండి :

థాంక్యూ సినిమా రివ్యూ & రేటింగ్!


ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus