“ఉన్నది ఒకటే జిందగీ” తర్వాత రామ్ చేస్తున్న చిత్రం “హలో గురు ప్రేమకోసమే..” త్రినాథ్‌రావు నక్కిన దర్శకుడు. అనుపమ పరమేశ్వరన్ కథానాయిక. ప్రకాశ్‌రాజ్, ప్రణీత కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాతో పాటు ప్రవీణ్ సత్తారు తో కూడా ఒక సినిమా అనుకున్నాడు.
స్రవంతీ మూవీస్ బ్యానర్ పైనే ఈ సినిమా చేయాలనుకున్నారు.
కానీ అదే బడ్జెట్ పెరుగుదల కారణంగా వాళ్లు కూడా పక్కకి తప్పుకున్నారు. ఈ కారణంగా రామ్ ఈ ప్రాజెక్టును పక్కన పెట్టేయడంతో ధనుష్ తో చేయాలని ప్రవీణ్ సత్తారు భావించాడు. తెలుగు .. తమిళ భాషల్లో చేయడం వలన బడ్జెట్ కలిసొస్తుందంటూ ధనుష్ కి వినిపించాడట. త్వరలోనే ఈ సినిమాకి సంబoధించిన ఒక ప్రకటన రానుంది.