Dharja Review: దర్జా సినిమా రివ్యూ & రేటింగ్!

బుల్లితెరపై స్టార్ యాంకర్ గా రాణిస్తున్న అనసూయ సినిమాల్లో కూడా బిజీగా రాణిస్తుంది. అయితే ఆమె మెయిన్ రోల్ పోషించిన సినిమాలు తక్కువ. అలాంటి వాటిలో ‘దర్జా’ కూడా రూపొందింది. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ మూవీ. సునీల్ కూడా ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించాడు. ఆల్రెడీ ఈ కాంబో ని మనం ‘పుష్ప’ లో చూశాం. ‘దర్జా’ టైటిల్ జనాల నోట్లో నానడానికి ప్రధాన కారణం వీళ్ళే అని చెప్పాలి.ఈ సినిమా పై బజ్ ఏర్పడింది అన్నా కూడా వాళ్లే కారణం అని చెప్పాలి. టీజర్, ట్రైలర్ వంటివి చూస్తుంటే ఇద్దరూ పోటీపడి నటించినట్టు స్పష్టమవుతుంది. మరి సినిమా ఎలా ఉందో ఓ లుక్కేద్దాం రండి :

కథ : బందరు నేపథ్యంలో జరిగే కథ ఇది. కనకం అలియాస్ కనక మహాలక్ష్మి (అనసూయ) అక్కడ రాజ్యమేలుతూ తనకి అడ్డొచ్చిన వాళ్ళను చంపుతూ ఓ లేడీ డాన్ లా వ్యవహరిస్తుంటుంది. పోలీసులు, రాజకీయ నాయకులు కూడా ఆమె అంటే భయపడుతుంటారు.కనకం చేయని అసాంఘిక చర్యలు అంటూ ఉండవు. సారా వ్యాపారం, ఉమెన్ ట్రాఫికింగ్ వంటి ఎన్నో ఘోరమైన పనులు చేస్తూ ఉంటుంది.

తన తమ్ముడు కూడా ఈమెకు అడ్డు వచ్చిన వాళ్ళను చంపేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో ఓ ప్రేమ జంట. అందులో ప్రియుడు మరణించడం.ఆ కేసు బందరు కి కొత్తగా వచ్చిన ACP శివ శంకర్ పైడిపాటి(సునీల్) వద్దకు వెళ్లడం. ఆ తర్వాత అతను బందరు కనకం ఆగడాలను కట్టించడం? మిగిలిన కథగా చెప్పుకోవచ్చు.

నటీనటుల పనితీరు : అనసూయ ఈ మధ్య కాలంలో విభిన్న పాత్రలు ఎంపిక చేసుకుంటూ వస్తుంది. అందులో ఈ ‘దర్జా’ లో చేసిన కనకం పాత్ర ఒకటి. ఇన్నాళ్లు తన గ్లామర్ ను, మంచి నటనను చూపిస్తూ వచ్చిన అనసూయలో ఇంత క్రూరత్వం దాగి ఉందా అనేలా.. ఈ చిత్రంలో ఆమె పాత్రని డిజైన్ చేశారు. అందుకు తగ్గట్టే అనసూయ ఈ చిత్రంలో బాగా నటించింది. యాక్షన్ సన్నివేశాల్లో కూడా బాగా కష్టపడింది.కాకపోతే ఆమె గొంతు గంభీరంగా లేకపోవడం మైనస్. సునీల్ ను పవర్ ఫుల్ రోల్ లో చూడడం ఇదే మొదటి సారి.

‘తడాఖా’ లో మలి సగం అతను పవర్ ఫుల్ గా కనిపిస్తాడు. మళ్ళీ అలాంటి రోల్ ఈ మూవీతో అతనికి దొరికింది. ఆ ఛాన్స్ ను అతను బాగానే వాడుకుని మంచి నటన కనబరిచాడు. సర్కార్ పాత్రలో ఎన్. రామ్ నెగిటివ్ షేడ్ లో ఒదిగిపోయాడు. భవిష్యత్తులో అతను మంచి విలన్ గా సెటిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.మిగిలిన నటీనటులు ఉన్నంతలో తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతిక నిపుణుల పనితీరు : దర్శకుడు సలీమ్ మాలిక్ రాసుకున్న కథ..బాగానే ఉంది. కానీ కథనం వీక్ గా ఉంది అని చెప్పాలి.అతను మంచి క్యాస్టింగ్ ను ఎంపిక చేసుకున్నాడు. పేరున్న నటీనటులను ఎంపిక చేసుకోవడం వల్ల ఫ్రేమ్ రిచ్ గా కనిపిస్తుంది, సినిమాకు కావాల్సిన పబ్లిసిటీ దక్కింది. కానీ దర్శకుడి ఫోకస్ మొత్తం అనసూయ, సునీల్,ఎన్. రామ్ పాత్రల పైనే పెట్టాడు.మిగిలిన పాత్రలను, కథనాన్ని అతను గాలికి వదిలేశాడు. అతని కంటే ఫైట్ మాస్టర్ కు ఎక్కువ పని పెట్టాడు.

సంగీతం గుర్తుంచుకునేలా లేదు. నేపథ్య సంగీతం కూడా అంతంత మాత్రమే. ఎడిటింగ్,సినిమాటోగ్రఫీ సో సో గా ఉన్నాయి.రన్ టైం 2 గంటల 10 నిమిషాలే ఉండడం ఓ ప్లస్ పాయింట్ గా చెప్పుకోవాలి.అలాగే నిర్మాతలు బాగా ఖర్చు చేశారు. భవిష్యత్తులో పెద్ద సినిమాలు నిర్మించగలం అని ఈ చిత్రంతో తెలియజేసారు. కానీ ఇలాంటి కథకి అంత భారీ బడ్జెట్ అవసరం లేదు.

విశ్లేషణ : ‘దర్జా’ గా చూసే సినిమా అయితే కాదు.. కానీ సునీల్, అనసూయ , కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ కోసం వీకెండ్ కు ఒకసారి ట్రై చేయొచ్చు.

రేటింగ్ : 1.5/5

Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus