పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh) చిత్రం నిన్న అంటే మార్చి 19న ఉగాది పండుగ సందర్భంగా రిలీజ్ అయ్యింది. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటించింది.
మొదటి నుండి ఈ సినిమాపై బజ్ లేదు. మరోపక్క ‘దురంధర్ 2’ పోటీగా రిలీజ్ అవుతుంది. ఆ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’…. ‘గబ్బర్ సింగ్’ కాంబో అవ్వడం వల్ల.. హోప్స్ పెట్టుకున్న వాళ్ళు కూడా లేకపోలేదు.
అయితే మొదటి రోజు మొదటి షోకే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. కానీ తర్వాతి షోలకి అది పాజిటివ్ గా టర్న్ అయ్యింది. ‘ ‘గబ్బర్ సింగ్’ రేంజ్లో లేకపోయినా ‘సర్దార్ గబ్బర్ సింగ్’ కంటే బెటర్ గానే ఉంది… ముఖ్యంగా ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ నుండి ఇలాంటి ఎనర్జిటిక్ మూవీ అయితే రాలేదు’ అని అంతా అభిప్రాయపడ్డారు. దీంతో మొదటి రోజు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ బాక్సాఫీస్ వద్ద కూడా షో షోకి ఇంప్రూవ్ అయ్యింది. అయితే తొలిరోజు రికార్డు బ్రేకింగ్ వసూళ్లు నమోదవుతాయా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.
ఎందుకంటే.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి తెలంగాణాలో టికెట్ హైక్స్ అనేవి లభించలేదు. అందువల్ల నార్మల్ టికెట్ ధరలకే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ని రిలీజ్ చేశారు. మార్నింగ్ షోలు యావరేజ్ బుకింగ్స్ తో స్టార్ట్ అయ్యాయి.. కానీ తర్వాత బాగానే పెరిగాయి. హాలిడే అడ్వాంటేజ్ కారణంగా ఫ్యామిలీ ఆడియన్స్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ని చూసేందుకు ఇంట్రెస్ట్ చూపించారు.
ఈ నేపధ్యంలో మొదటి రోజు ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రూ.32 కోట్ల వరకు షేర్ ను కలెక్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది. మరి వరల్డ్ వైడ్ లెక్కలు ఎలా ఉంటాయో తెలియాల్సి ఉంది. ఏదేమైనా లో- బజ్ తో రిలీజ్ అయినప్పటికీ ఈ సినిమా ఈ రేంజ్లో కలెక్ట్ చేయడం గొప్ప విషయమే.