బిగ్ బాస్ ఇంట్లో కి రావాలంటే టాలెంట్ ఉండాలి… ఇంట్లోకి వచ్చాక బిగ్ బాస్ ఇచ్చే టాస్క్ లు చెయ్యాలంటే ధైర్యం.. తెగింపు ఉండాలి. ఈ సీజన్ లో అలాంటి కంటెస్టెంట్ లలో ఒకరు హారిక. ఇంట్లోకి వచ్చిన తొలిరోజు నుంచి ప్రతి టాస్క్ లో తనను తాను నిరూపించుకుంటూ వస్తోంది. తాజాగా మరోసారి తన ధైర్యం, తెగువ చూపించి… రౌడి బేబీ మామూలు పిల్ల కాదు అనిపించింది. డీల్ ఆర్ నో డీల్ అంటూ బిగ్ బాస్ ఈ రోజు ఒక టాస్క్ పెట్టాడు. బిగ్ బాస్ డీల్ అంటే మామూలుగా ఉండదు కదా.
ఇంట్లోని అమ్మాయిల్లో ఒకరు మెడ వరకు జుట్టు కత్తిరించుకొని ఎరుపు రంగు వేసుకోవాలని బిగ్ బాస్ టాస్క్ ఇచ్చాడు. దానికి హారిక ముందుకు వచ్చింది. దానికి ముందు కాస్త చర్చ జరిగినా హారిక ఫైనల్ గా కత్తిరించుకున్నట్లు తెలుస్తోంది. మామూలుగా అమ్మాయిలకు హెయిర్ అంటే ఎంత ఇష్టమో మనకు తెలిసిందే. అలాంటి హెయిర్ కట్ చేయించుకుంది అంటే మామూలు విషయం కాదు కదా. మరి షార్ట్ హెయిర్ లో హారిక ఎలా ఉంటుందో ఈ రోజు రాత్రి తెలుస్తుంది. అన్నట్లు హెయిర్ కట్ చేస్తున్నప్పుడు హారిక `అన్నయ్యా సారీ అంటూ బాధ పడింది`, ఇంటి నుంచి వచ్చేటప్పుడు హారిక వాళ్ళ అన్నయ్య ఈ హెయిర్ కట్ వద్దు అన్నాడట.
హారిక కాకుండా ఈ రోజు ఈ డీల్స్ లో కుమార్ సాయి, అభిజీత్ కూడా ఉన్నారు. తన వార్డ్రోబ్ లో వస్తువులు ఇచ్చేయడం అభి కి వచ్చిన డీల్ కాగా, కుమార్ సాయి తన దుస్తుల్ని కత్తిరించుకోవాలి. వాళ్ళు కూడా ఈ పనులు బాగానే చేశారు. ఇంకా ఎవరెవరు ఈ డీల్స్ తీసుకున్నారో చూడాలి.