“గౌతమి పుత్ర శాతకర్ణి” సినిమా రిలీజ్ సమయంలోనే తాను రాయని లేఖను ఈనాడు దినపత్రిలో “రాజమౌళి రాసిన ప్రశంసా పత్రం”గా క్రిష్ ప్రమోట్ చేసినప్పుడే రాజమౌళి కాస్త గట్టిగా “అది నేను రాయలేదు” అని రెస్పాండ్ అవ్వడం.. క్రిష్ అందుకు క్షమాపనలు కోరడం జరిగాయి. అప్పట్నుంది క్రిష్ & రాజమౌళి నడుమ అంత సఖ్యత లేదు. ఇప్పుడు ఆ చిన్నపాటి స్నేహం కూడా సన్నగిల్లేలా కనిపిస్తోంది. అందుకు కారణంగా క్రిష్ ను ఎండగట్టడమే కాక అతడికి బాలీవుడ్ లో మరో నిర్మాత సినిమా అవకాశం ఇవ్వడానికి కూడా భయపడేలా రచ్చ చేసి కంగనాకి రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ తెగ హెల్ప్ చేస్తుండడమే.
“మణికర్ణిక” సినిమా టైమ్ లో కంగనా & ఆమె చెల్లెలు రంగోలి దర్శకుడు క్రిష్ ను రకరకాలుగా ఎండగట్టిన విషయం తెలిసిందే. సరిగ్గా అదే సమయానికి క్రిష్ దర్శకత్వంలో రూపొందిన “ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు” చిత్రాలు డిజాస్టర్లుగా నిలవడం క్రిష్ కి పుండు మీద కారం జల్లినట్లుగా అయ్యింది. ఇప్పుడు విజయేంద్రప్రసాద్ స్పెషల్ గా కంగనా కోసం అయోధ్య నేపధ్యంలో ఒక కథను రాసివ్వడం క్రిష్ కు నచ్చలేదంట. ముఖ్యంగా తనను ఇంతగా అవమానించిన హీరోయిన్ కి రాజమౌళి తండ్రి ఆస్థాన రైటర్ గా మారిపోవడం క్రిష్ ని చాలా ఇబ్బందిపెడుతోంది.