విజయ్ గోల పడలేక డియర్ కామ్రేడ్ నుండి డైరెక్టర్ అవుట్

  • June 26, 2019 / 06:52 PM IST

తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు యావత్ ప్రపంచంలో పరిచయం అవసరం లేని కథానాయకుడిగా తనకంటూ సెపరేట్ రూట్ క్రియేట్ చేసుకోవడమే కాక స్టార్ డమ్ క్రియేట్ చేసుకొన్న ఏకైక హీరో విజయ్ దేవరకొండ. ప్రస్తుతం మనోడి పేరు ఒక బ్రాండ్, మనోడి వెనుక అందరు అగ్ర నిర్మాతలు క్యూ కట్టడమే కాదు.. ఆల్మోస్ట్ అందరు డైరెక్టర్లు కథలు చెప్పడం కోసం అతడి వెనుక తిరుగుతున్నారు. ఇక అమ్మాయిల్లో విజయ్ కి ఉన్న క్రేజ్ చూసి కుళ్లుకొని కథానాయకుడు లేడు. అలాంటి భీభత్సమైన ఇమేజ్ ఉన్న విజయ్ దేవరకొండ ఇప్పుడు అనవసరంగా నెగిటివ్ అవుతున్నాడు.

మేటర్ ఏంటంటే.. విజయ్ దేవరకొండ తాజా చిత్రం “డియర్ కామ్రేడ్” రిలీజ్ కి రెడీగా ఉండగా.. ఆ సినిమా అవుట్ పుట్ విషయంలో విజయ్ సాధారణంగా కంటే ఎక్కువగా రియాక్ట్ అవుతూ ఇన్వాల్వ్ అవుతున్నాడట. ఈమధ్యే ఎడిటింగ్ విషయంలో విజయ్ కి దర్శకుడు భరత్ కమ్మకి నడుమ గొడవ అయ్యిందని.. దాంతో భరత్ సైలెంట్ అయిపోయాడని ఫిలిమ్ నగర్లో టాక్ నడుస్తోంది. మరి ఈ విషయంలో నిజమెంత అనేది తెలియాలంటే కొన్నాళ్లపాటు ఆగాలి లేదా “డియర్ కామ్రేడ్” టీం మెంబర్స్ లో ఎవరో ఒకరు రెస్పాండ్ అవ్వాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus