డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ ‘విక్కీ ది రాక్ స్టార్’ టైటిల్ లోగో విడుదల

ప్రతి ఒక్కరి జీవితంలో జరిగే ట్రూ ఇన్సిడెంట్స్ ని ఆధారంగా చేసుకొని, గొప్ప ప్రొడక్షన్ వాల్యూస్ తో తెరకెక్కుతున్న చిత్రం విక్కి ది రాక్ స్టార్ సిఎస్ గంటా దర్శకత్వంలో శ్రీమతి వర్దిని నూతలపాటి సమర్పణలో స్టూడియో87 ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రానికి ఫ్లైట్ లెఫ్టినెంట్ శ్రీనివాస్ నూతలపాటి(IAF) నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సుభాష్, చరిత ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ బాధ్యతలు చేపట్టారు. పలు హిట్ సినిమాలకు మ్యూజిక్ అందించిన సునీల్ కశ్యప్ బాణీలు కడుతున్నారు. సినిమాటోగ్రాఫర్‌ భాస్కర్

Click Here To Watch NOW

విక్రమ్, అమృత చౌదరి, ప్రధాన పాత్రలలో రియ గుడివాడ , సాహితి, నానాజీ, రవితేజ, విశాల్, వంశీ రాజ్ నెక్కంటి, లావణ్య రెడ్డి కీలక పాత్రలు పోషిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్య క్రమాలు చేస్తూనే ప్రమోషన్స్ చేపట్టి సినిమా పట్ల హైప్ పెంచేస్తున్నారు మేకర్స్. ఈ నేపథ్యంలోనే రాక్ స్టార్ టైటిల్ లోగో, వీడియో రిలీజ్ చేసి సినిమాపై ఆసక్తి పెంచారు. ఇప్పటి వరకు టాలీవుడ్‌లో ఎవ్వరు చేయని జానర్‌ని టచ్ చేస్తూ రెవల్యూషన్ థాట్స్‌తో మ్యూజిక్‌ని బేస్ చేసుకొని తీసిన సినిమా ఇది.

కథ రిఫ్లెక్ట్ అయ్యేలా చాలా కొత్తగా ఈ రాక్ స్టార్ టైటిల్ లోగో ఉంది. ఎరుపు రంగులో టైటిల్ డిజైన్ చేసిన విధానం ఆకట్టుకుంటోంది. ఈ మేరకు విడుదల చేసిన వీడియో ప్రేక్షకులను ఆకర్షిస్తోంది. అతిత్వరలో ఫస్ట్ లుక్‌తో పాటు ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు మేకర్స్.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!


‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags