కోలీవుడ్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన విజయ్ సేతుపతి, త్రిష ల ’96’ చిత్రాన్ని తెలుగులో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు రీమేక్ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో శర్వానంద్, సమంత ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు. తెలుగు నేటివిటీకి తగినట్టుగా ఈ చిత్ర కథలో చిన్నచిన్న మార్పులు చేయించి, టైటిల్ కూడా తెలుగులో ఉండాలని భావిస్తున్నారట.
ఇప్పటికే ఈ చిత్రం కోసం ‘జాను’ .. ‘జాను అలియాస్ జానకి’ అనే రెండు పేర్లను అనుకున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రానికి ‘జానకీదేవి’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. ఇక మర్చి 6 న శర్వానంద్ పుట్టినరోజు కావడంతో .. ఆ రోజున టైటిల్ లోగోను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. ఏప్రిల్లో ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్ళి దసరా కానుకగా విడుదల చేయాలనే ప్లాన్ లో దిల్ రాజు ఉన్నట్టు తెలుస్తుంది.