ఒకవైపు నిర్మాతగా మరోవైపు డిస్ట్రిబ్యూటర్ గా దిల్ రాజు సత్తా చాటుతున్నారనే సంగతి తెలిసిందే. పెద్ద హీరోల సినిమాలను పరిమితంగా నిర్మిస్తున్న దిల్ రాజు పెద్ద సినిమాలకు డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరిస్తూ కళ్లు చెదిరే లాభాలను సొంతం చేసుకుంటున్నారు. దిల్ రాజు హక్కులను కొనుగోలు చేసిన సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధిస్తుండటం గమనార్హం. ఆర్ఆర్ఆర్ సినిమాతో దిల్ రాజుకు 40 కోట్ల రూపాయలకు అటూఇటుగా లాభాలు వచ్చాయి. ఈ సినిమా సక్సెస్ తర్వాత కేజీఎఫ్2 సక్సెస్ తో దిల్ రాజు ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ చేరింది.
కేజీఎఫ్2 సినిమా ఫస్ట్ వీకెండ్ లో ఏకంగా నైజాం ఏరియాలో 28 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించి ఇప్పటికే బ్రేక్ ఈవెన్ అయింది. కేజీఎఫ్2 సినిమా దిల్ రాజుకు రెట్టింపు లాభాలను అందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దిల్ రాజు చాలా లక్కీ డిస్ట్రిబ్యూటర్ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు దిల్ రాజు నిర్మాతగా ఎఫ్3, థాంక్యూ, శంకర్ చరణ్ కాంబో మూవీ తెరకెక్కుతుండగా కొన్ని నెలల గ్యాప్ లోనే ఈ సినిమాలన్నీ రిలీజ్ కానున్నాయి.
ఈ సినిమాలతో దిల్ రాజు నిర్మాతగా కూడా సత్తా చాటుతారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. దిల్ రాజు స్థాయిలో లక్ ఉన్న ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ మరెవరూ లేరనే చెప్పాలి. దిల్ రాజు తన బ్యానర్ లో తెరకెక్కే సినిమాలను పరిమిత బడ్జెట్ తోనే క్వాలిటీతో తెరకెక్కిస్తున్నారు. టాలెంట్ ఉన్న యంగ్ జనరేషన్ డైరెక్టర్లకు అవకాశాలను ఇస్తూ దిల్ రాజు ప్రోత్సహిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో దిల్ రాజు చేతిలో ఎక్కువ సంఖ్యలో థియేటర్లు ఉండటంతో నిర్మాతలు సైతం తమ సినిమా హక్కులను దిల్ రాజుకు ఇవ్వడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఎఫ్3 సినిమా వచ్చే నెల 27వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాపై భారీస్థాయిలో అంచనాలు నెలకొన్నాయి.