స్టార్ హీరోలతో సమానమైన ఇమేజ్ ఉన్న ఏకైక నిర్మాత దిల్ రాజు. హీరోహీరోయిన్లు లేదా దర్శకుల పేర్లు పోస్టర్ల మీద చూస్తూ సినిమాలకు వెళ్ళే ప్రేక్షకులు నిర్మాత టైటిల్ కార్డ్ చూసి థియేటర్ కి వచ్చేలా చేశాడు దిల్ రాజు. అందుకే ఆయన నిర్మాణంలో నటించేందుకు అగ్ర కథానాయకులు కూడా ఉవ్విళ్లూరారు. అలాంటి సూపర్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ అయిన దిల్ రాజు ఈమధ్యకాలంలో వరుస ఫ్లాపులతో ఇబ్బందిపడుతున్నాడు. నిర్మాతగా మాత్రమే కాదు డిస్ట్రిబ్యూటర్ గానూ ఆయన ఈమధ్యకాలంలో చాలా దారుణంగా నష్టపోయాడు. ఈమధ్యకాలంలో ఆయన నిర్మాణంలో లేదా డిస్ట్రిబ్యూట్ చేసిన సినిమాలన్నీ పరాజయం పాలయ్యాయి.
ముఖ్యంగా.. దిల్ రాజు డబ్బు నష్టపోయినదానికంటే ఒక మేకర్ గా తన మార్క్ కోల్పోతున్నాడు దిల్ రాజు. “లవర్, శ్రీనివాస కళ్యాణం” సినిమాల విడుదలకు ముందు దిల్ రాజు విపరీతమైన కాన్ఫిడెన్స్ చూపించాడు. కట్ చేస్తే.. రెండు సినిమాలు డిజాస్టర్లుగా నిలవడం మాత్రమే కాదు తీవ్రమైన నష్టాలు చవిచూడాల్సి వచ్చింది. దాంతో దిల్ రాజు ఇప్పుడు తన డెసిషన్ మేకింగ్ లో అప్డేట్ అవ్వాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని గ్రహించి ప్రస్తుతం ప్రొడక్షన్ లో ఉన్న సినిమాలు పూర్తయ్యేవరకూ వేరే సినిమాలేవీ మొదలెట్టకూడదని నిర్ణయించుకొన్నాడట. మరి “ఎఫ్ 2, హలో గురు ప్రేమ కోసమే” చిత్రాలు దిల్ రాజు మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి వస్తాడేమో చూడాలి.