Dil Raju: శంకర్ మూవీ విషయంలో చరణ్ ఫ్యాన్స్ బాధ ఇదే!

  • June 30, 2022 / 11:58 AM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా సినిమాలను నిర్మిస్తూ బిజీగా ఉన్న నిర్మాతలలో దిల్ రాజు ఒకరు. దిల్ రాజు బ్యానర్ లో సినిమా అంటే కొన్నేళ్ల క్రితం వరకు ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన అభిప్రాయం ఉండేది. ఈ మధ్య కాలంలో దిల్ రాజు సక్సెస్ రేట్ తగ్గడంతో పాటు ఆయన ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న సినిమాలలో కొత్తదనం ఉండటం లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఎఫ్3 సినిమా సక్సెస్ సాధించినా ఆ సినిమా నిర్మాతగా దిల్ రాజు రేంజ్ హిట్ కాదని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

దిల్ రాజు నిర్మాతగా శంకర్ చరణ్ కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ కోసం చరణ్ అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. టైటిల్ కు సంబంధించి, రిలీజ్ డేట్ కు సంబంధించిన అప్ డేట్లు ఇస్తే బాగుంటుందని అభిమానులు భావిస్తున్నారు. సినిమాకు సంబంధించి సరిగ్గా ప్రమోషన్స్ చేయడంలో దిల్ రాజు ఫెయిల్ అవుతున్నాడని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

దిల్ రాజు ఈ కామెంట్ల గురించి ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. శంకర్ చరణ్ కాంబో మూవీ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతుండగా ఈ సినిమా బడ్జెట్ ఏకంగా 300 కోట్ల రూపాయలు అని తెలుస్తోంది. స్టార్ డైరెక్టర్ రాజమౌళి తన సినిమా ప్రమోషన్స్ విషయంలో సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలైనప్పటి నుంచి జాగ్రత్తలు తీసుకుంటారు. దిల్ రాజు సైతం ఇదే స్ట్రాటజీని ఫాలో కావాల్సి ఉంది.

శంకర్ డైరెక్షన్ లో సినిమా అంటే తమిళంలో కూడా ఈ సినిమాకు రికార్డు స్థాయిలో బిజినెస్ జరిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. 2023 సమ్మర్ టార్గెట్ గా ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోందని తెలుస్తోంది. విజయ్ వంశీ పైడిపల్లి కాంబో మూవీని కూడా దిల్ రాజు భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. చరణ్ మూవీని థియేటర్లలో చూడాలంటే అభిమానులు మరో ఏడాదిపాటు ఎదురు చూడాల్సిందేనని తెలుస్తోంది.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus