ప్రముఖ నిర్మాత దిల్ రాజు భార్య మృతి!
- March 11, 2017 / 02:00 PM ISTByFilmy Focus
ప్రముఖ టాలీవుడ్ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు అలియాస్ వి.వెంకట రమణారెడ్డి భార్య అనిత (46) శనివారం గుండెపోటుతో మృతి చెందారు. గత కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు, హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె ఇవాళ తుది శ్వాస విడిచారు. కాగా దిల్ రాజు ప్రస్తుతం నాని సినిమా షూటింగ్ నిమిత్తం అమెరికాలో ఉన్నారు. ఈ దంపతులకు ఒక కుమార్తె. ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. ఇటీవలే దిల్‌రాజుకు మనుమరాలు కూడా పుట్టారు. రేపు అత్యక్రియలు జరగనున్నాయని తెలిసింది. సినీ వర్గాల నుండి అందిన సమాచారం మేరకు ఈ విషయం తెలిసింది, ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇన్నాళ్లు దిల్ రాజుగారి ప్రయాణంలో అడుగడునా ఆయనకు సపోర్ట్ చేస్తూ, ఆయన ఉన్నతికి తన వంతు భాద్యత నిర్వహించిన ఆమె మరణం ప్రతి ఒక్కర్ని కలచివేస్తోంది. పరిశ్రమలోని ఏంటో మంది నటీనటులకు, దర్శకులకు, సాంకేతిక నిపుణలకు అనేక విధాలుగా సహాయపడే మంచి మనిషి దిల్ రాజుగారికి, ఆయన కుటుంబానికి ఫిల్మీ ఫోకస్ ప్రగాఢ సంతాపం తెలుపుతోంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.













