Dilraju: ‘హిట్’ దర్శకుడితో దిల్ రాజు.. భారీ బడ్జెట్ సినిమా..!

  • June 12, 2023 / 05:22 PM IST

విశ్వక్ సేన్ తో ‘హిట్’ అనే చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు శైలేష్ కొలను. అది 5 కోట్ల బడ్జెట్ లో తీసిన సినిమా. దాని రేంజ్ కి ఆ సినిమా బాగానే కలెక్ట్ చేసింది. అంతేకాదు విశ్వక్ సేన్ కు మొదటి కమర్షియల్ సక్సెస్ ను అందించింది ఈ చిత్రం. ఆ తర్వాత ‘హిట్ 2 ‘ అనే చిత్రాన్ని ప్లాన్ చేశాడు. దీని బడ్జెట్ కొంచెం ఎక్కువ. అయితే అంతకు మించి పారితోషికం అడుగుతున్నాడని విశ్వక్ సేన్ ను..

నిర్మాత నాని పక్కన పెట్టినట్టు అప్పట్లో టాక్ నడిచింది. దీంతో అడివి శేష్ తో ఆ ప్రాజెక్టుని కంప్లీట్ చేశారు. రూ.15 కోట్ల బడ్జెట్ లో తీసినా.. ఆ సినిమా రూ.20 కోట్లు పైనే కలెక్ట్ చేసింది. తర్వాత ‘హిట్ 3 ‘ అనౌన్స్ చేశారు. నాని ఈ చిత్రంలో హీరోగా చేయాలి. దీని బడ్జెట్ రూ.30 కోట్ల నుండి రూ.50 కోట్లు ఉండొచ్చు. అయితే మధ్యలో వెంకటేష్ తో ‘సైంధవ్’ అనే చిత్రాన్ని రూపొందిస్తున్నాడు శైలేష్ కొలను.

ఇది కూడా హిట్ కి సిమిలర్ గా ఉంటుంది. దీని బడ్జెట్ రూ.70 కోట్లు అవ్వొచ్చు. అయితే రూ.50 కోట్ల బడ్జెట్ కి శైలేష్ ఇంకా న్యాయం చేయలేదు. కాదు కాదు ఆ అవకాశం రాలేదు కాబట్టి ప్రూవ్ అవ్వలేదు. కానీ ఇతనికి దిల్ రాజు ఓ మంచి ఆఫర్ ఇచ్చాడట. అది కూడా పాన్ ఇండియా లెవెల్లో ఓ సినిమా చేసే అవకాశం. దీని బడ్జెట్ రూ.150 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తుంది.

ఈ ప్రాజెక్టు కోసం ఓ బాలీవుడ్ హీరోని ఒప్పించే పనిలో ఉన్నారు. అది వర్కౌట్ కాకపోతే టాలీవుడ్ హీరోతోనే లాగించేస్తారు. కానీ అంత బడ్జెట్ కి శైలేష్ న్యాయం చేయగలడా? అసలే ‘శాకుంతలం’ తో దిల్ రాజుకి (Dilraju) పెద్ద దెబ్బ తగిలింది. మరి ఫైనల్ గా ఏమవుతుందో చూడాలి..!

టక్కర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!

అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్లు వీళ్లేనా..!/a>
కలెక్షన్లలో దూసుకుపోతున్న లేడీ ఓరియంటల్ సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus