Dimple Hayathi: భాగ్యలక్ష్మి రేంజ్లో బాలామణి ఇంప్రెస్ చేయలేకపోయింది

ఒక సీజన్లో ఒక సినిమా వచ్చి సక్సెస్ కొట్టింది అంటే చాలు.. ఆ హిట్టు సినిమా ఫార్ములాని ఫాలో అయిపోయి హిట్లు కొట్టేద్దామని మిగతా ఫిలింమేకర్స్ రెడీ అయిపోతారు. అందుకు బెస్ట్ ఎగ్జామ్పుల్స్ చాలా ఉన్నప్పటికీ.. ప్రస్తుతానికి మనం ఒకటి చెప్పుకోవాలి కాబట్టి.. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమా గురించి చెప్పుకుందాం. గతేడాది ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే సినిమా వచ్చి పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టింది. అనిల్ రావిపూడి ఆ సినిమాకి దర్శకుడు.

Dimple Hayathi

పెళ్ళానికి ప్రియురాలికి మధ్య నలిగిపోయే హీరో కథ అది. దానికి క్రైమ్, పాలిటిక్స్,మెసేజ్ అంటూ చాలా అంశాలు జోడించాడు దర్శకుడు. వాటి మధ్యలో వచ్చే ఫన్ ఆడియన్స్ కి ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. పైగా వెంకటేష్ కి ఫ్యామిలీ ఆడియన్స్ లో ఉండే క్రేజే వేరు. అవన్నీ పక్కన పెట్టేస్తే ఆ సినిమాలో భాగ్యలక్ష్మి పాత్ర పోషించిన ఐశ్వర్య రాజేష్ పలికించిన హావభావాలు కానీ డైలాగ్ డెలివరీ కానీ ఫ్యామిలీ ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకున్నాయి.

‘సంక్రాంతికి వస్తున్నాం’ వరకు ఐశ్వర్య రాజేష్ కి తెలుగులో సరైన హిట్టు లేదు.ఆమె సూపర్ టాలెంటెడ్ యాక్ట్రెస్ కానీ చామన ఛాయలో ఉండటం వల్లో ఏమో కానీ తెలుగు ఫిలిం మేకర్స్ ఎక్కువగా ఆమెకు అవకాశాలు కల్పించలేదు. నాని వంటి హీరోల సినిమాల్లో ఆమెను సెకండ్ హీరోయిన్ గా పడేసేవారు. కానీ ‘సంక్రాంతికి వస్తున్నాం’ తర్వాత ఆమె రియల్ టాలెంట్ తెలుగు ప్రేక్షకులకు, ఫిలిం మేకర్స్ కి తెలిసొచ్చింది.

సరిగ్గా ఇలానే తనకు కూడా కలిసొస్తుందేమో అని హీరోయిన్ డింపుల్ హయాతి(Dimple Hayathi) ఆశపడింది. రవితేజ నటించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే ఫ్యామిలీ సినిమా ఈ సంక్రాంతికి వచ్చింది. ఇది కూడా పెళ్ళానికి ప్రియురాలికి మధ్య నలిగిపోయిన హీరో కథే.ఇందులో బాలామణి అనే ఇల్లాలి పాత్ర పోషించింది డింపుల్. ప్రమోషనల్ కంటెంట్ లో ఈమె పాత్రకి సంబంధించిన విజువల్స్ చూసి ‘సంక్రాంతికి వస్తున్నాం’ లో ఐశ్వర్య రాజేష్ పోషించిన భాగ్యలక్ష్మి పాత్ర రేంజ్లో క్లిక్ అవుతుందేమో అని కొందరు అనుకున్నారు.

కానీ సినిమాలో ఈమె పాత్రకి సరైన ఆర్క్ అండ్ ఎమోషన్ లేకపోవడం వల్ల.. ఆశించిన స్థాయిలో మార్కులు పడలేదు. ఈమె కూడా టాలెంటెడ్ యాక్ట్రెస్. మిడ్ రేంజ్ సినిమాల్లో హీరోయిన్ గా అవకాశాలు పొందుతుంది కానీ.. ఆశించిన బ్రేక్ రావడం లేదు. ఈసారి కూడా ఆమెకు నిరాశ తప్పలేదు అనే చెప్పాలి.

 ‘విశ్వంభర’ ఎస్కేప్ అయ్యాడు.. ‘ది రాజాసాబ్’ దొరికేశాడు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus