మూడోసారి రవితేజతో ఆ హీరోయిన్‌.. ఈసారి ఎలా కనిపిస్తారో?

ఒక హీరోయిన్‌తో రెండో సినిమా చేస్తున్నాడు ఓ హీరో అంటే.. ఆయన అభిమానులు కొత్త కాంబినేషన్‌ వెతకొచ్చు కదా అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. అందుకే ఒకప్పుడు ఎక్కువగా కనిపించిన రిపీట్‌ కాంబోలు ఇప్పుడు బాగా తగ్గిపోయాయి. ఒకవేళ కుదిరినా రెండోసారి తప్ప.. మూడోసారి చాలా అరుదు. అందులో ఆ కాంబో హిట్‌ అయితేనే లేక ఆ హీరోయిన్‌ స్టార్‌ హీరోయిన్‌ అయితేనో కానీ ఇప్పుడు టాలీవుడ్‌లో ఓ నాన్‌స్టార్‌ – ఒక స్ట్రగ్లింగ్‌ స్టార్‌ కాంబో మూడోసారి సెట్ అవుతోంది.

Dimple Hayathi

వాళ్లే మాస్‌ మహారాజ రవితేజ, డస్కీ బ్యూటీ డింపుల్‌ హయాతీ. ఇప్పటికే రెండు సినిమాల్లో కలసి నటించిన డింపుల్‌తో మూడోసారి జతకట్టడానికి రవితేజ రెడీ అవుతున్నారట. ప్రస్తుత ‘ఇరుముడి’ సినిమాతో బిజీగా ఉన్న రవితేజ ఆ ప్రాజెక్ట్‌ తర్వాత వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాలోనే కథానాయికగా డింపుల్‌ హయాతీని తీసుకుంటున్నారని లేటెస్ట్‌ టాలీవుడ్‌ టాక్‌. ఇప్పటికే వీరిద్దరూ ‘కిలాడీ’, ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమాల్లో కలిసి నటించారు.

ఆ రెండు సినిమాల్లో రవితేజకు భార్యగా డింపుల్‌ కనిపించింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుట్‌ అయింది. దీంతో మరోసారి ఆ మ్యాజిక్‌ని రిపీట్ చేద్దామని టీమ్‌ ప్లాన్‌ చేస్తోందట. ఇందులో భార్య పాత్రనే చేస్తోందని సమాచారం. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమా సమయంలో డింపుల్‌ తన పాత్ర గురించి వేసిన జోక్‌ ఇంకా గుర్తుంది ఫ్యాన్స్‌కి. ఇప్పుఉ మళ్లీ భార్య పాత్ర అనేసరికి ఈ సారి ఎలాంటి కామెంట్‌ వస్తుందో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

వివేక్ ఆత్రేయ తనదైన స్టైల్‌లో కథను సిద్ధం చేస్తున్నారట. రవితేజ స్టైల్‌ కామెడీకి వివేక్‌ డిఫరెంట్‌ స్క్రీన్‌ప్లే యాడ్‌ చేసి కథను ఫైనల్‌ చేస్తున్నారట. ఈ మేరకు త్వరలో సినిమాను అధికారికంగా అనౌన్స్‌ చేస్తారట. అన్నట్లు ఈ సినిమాలో ఎప్పటిలాగే ఇంకో హీరోయిన్‌ కూడా ఉందట..

బాలకృష్ణ హెల్త్ బులిటెన్ విడుదల… డాక్టర్లు ఎం చెప్పారంటే ?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus