Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Ajay Bhupathi: ఇంటర్వ్యూ : ‘మంగళవారం’ గురించి దర్శకుడు అజయ్ భూపతి చెప్పిన ఆసక్తికర విషయాలు

Ajay Bhupathi: ఇంటర్వ్యూ : ‘మంగళవారం’ గురించి దర్శకుడు అజయ్ భూపతి చెప్పిన ఆసక్తికర విషయాలు

  • November 14, 2023 / 03:31 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ajay Bhupathi: ఇంటర్వ్యూ : ‘మంగళవారం’ గురించి దర్శకుడు అజయ్ భూపతి చెప్పిన ఆసక్తికర విషయాలు

‘ఆర్.ఎక్స్.100’ దర్శకుడు అజయ్ భూపతి చేసిన మరో వినూత్న ప్రయత్నం ‘మంగళవారం’. పాయల్ రాజ్‌ పుత్, ‘రంగం’ ఫేమ్ అజ్మల్ అమీర్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని.. ‘ముద్ర మీడియా వర్క్స్’ బ్యానర్ పై స్వాతి రెడ్డి గునుపాటి, ఎం సురేష్ వర్మతో కలిసి అజయ్ భూపతి ‘A’ క్రియేటివ్ వర్క్స్ సంస్థ పై ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. నవంబర్ 17న ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల అవుతోంది. ఇక ప్రమోషన్స్ లో భాగంగా దర్శకుడు అజయ్ భూపతి చెప్పిన కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు చూద్దాం :

ప్ర) ఈ మధ్య మీ సమోసా వీడియో బాగా వైరల్ అయ్యింది?

అజయ్ భూపతి : నిజంగా దాని గురించి మాట్లాడాలి. అది నేను 10 ఏళ్ళ క్రితం చేసిన షార్ట్ ఫిలింకి సంబంధించింది. ఆ వీడియోలో నేను స్లిమ్ గా ఉంటాను. కానీ ఆ వీడియోని బయటకి తీసినోడి ఓపికకి మెచ్చుకోవాలి(నవ్వుతూ).

ప్ర) ‘మహాసముద్రం’ తర్వాత ‘మంగళవారం’ ఐడియా ఎందుకు వచ్చింది?

అజయ్ భూపతి : ఐడియా అని పర్టిక్యులర్ గా ఏమీ లేదు.దాని కంటే ముందే నాకు ఆ ఐడియా ఉంది. మైండ్ లో చాలా ఐడియాలు రన్ అవుతూ ఉంటాయి. అయితే… ‘మహాసముద్రం’ చిత్రీకరణలో ఉండగా, మంగళవారం చేయాలని గట్టిగా ఫిక్స్ అయ్యాను. దీనిని కాంటెంపరరీ కథతో క్యారెక్టర్ బేస్డ్ సినిమాగా కమర్షియల్ విలువలతో తీశా. ఊహించని విధంగా ఈ సినిమా ఎండ్ అవుతుంది. ఇటువంటి సినిమాకు దర్శకత్వం వహించడం అంత సులభం కాదు. ప్రొడక్షన్ అండ్ టెక్నికల్ వాల్యూస్, ఆర్టిస్టుల పెర్ఫార్మన్స్ వంటివి అన్నీ బాగా మెయింటైన్ చేయాలి. విజువలైజేషన్ నాకు తప్ప సినిమాటోగ్రాఫర్ కి కూడా తెలియదు. మ్యూజిక్ డైరెక్టర్ కి కూడా అంతే! కానీ ఈ సినిమాకి అన్ని బాగా కుదిరాయి.

ప్ర)’ఆర్.ఎక్స్.100′ సినిమా విషయంలో మీ స్నేహితుడి లైఫ్ లో జరిగిన సంఘటనని ఆధారం చేసుకుని తీసినట్టు చెప్పారు. ఈ ‘మంగళవారం’ కి కూడా అలాంటి స్ఫూర్తి ఏమైనా ఉంటుందా?

అజయ్ భూపతి : కథ విషయంలో ఎలాంటి స్ఫూర్తి లేదు. కానీ కొన్ని క్యారెక్టర్స్ ని మాత్రం ఇన్స్పిరేషన్ గా తీసుకుని చేశాను.

ప్ర) హీరోయిన్ పాయల్ పాత్ర ఎలా ఉంటుంది?

అజయ్ భూపతి : ఆమె క్యారెక్టర్ మీరు టీజర్, ట్రైలర్స్ లో చూసినట్టు ఉండదు. చాలా ఎమోషనల్ రోల్ అది. సినిమా చూస్తున్నప్పుడు మీకు అర్ధమవుతుంది.మీరు కూడా సినిమా చూసి బయటకి వచ్చేప్పుడు ఎమోషనల్ అవుతారు.

ప్ర) ఈ సినిమాలో పాయల్ కంటే ముందు వేరే హీరోయిన్ ని అనుకున్నారా?

అజయ్ భూపతి :ముందుగా ఈ కథ అధితి రావు హైదరికి చెప్పాను. కానీ తర్వాత ఇది ఓ టీనేజ్ ఎండింగ్ లో ఉన్న అమ్మాయితో చేస్తే బాగుంటుంది అని అనిపించింది. ఎటువంటి అంచనాలు లేని కొత్తమ్మాయిని తీసుకుందామని ప్రయత్నించా. దాదాపు 40, 50 మంది అమ్మాయిలని ఆడిషన్ చేశా. పెర్ఫార్మన్స్ చేయాలి, ఇన్నోసెంట్ ఫేస్ ఉండాలి, గ్రామీణ నేపథ్యానికి ఆ అమ్మాయి సూటవ్వాలి. ప్రీ ప్రొడక్షన్ టైంలో హీరోయిన్ సెలెక్షన్ కోసం చాలా టైం పట్టింది. ఆ టైంలో పాయల్ మెసేజ్ చేసింది. మళ్ళీ మనం సినిమా చేద్దామా అని! 2 రోజులు టైం తీసుకుని నేను విజువలైజ్ చేసుకున్నా. సెట్ అవుతుందా? లేదా? అని! ఆ తర్వాత ఆమెను ఫైనల్ చేయడం జరిగింది.

ప్ర) పాయల్ రోల్ ఛాలెంజింగ్ గా అనిపిస్తుంది.. ఆమె భయపడలేదా?

అజయ్ భూపతి : తనకు నా మీద నమ్మకం ఉంది. ఆల్రెడీ ‘ఆర్ఎక్స్ 100’ చేశాం! ఫలితం బాగా వచ్చింది. ఆ సినిమాకు కూడా చాలా మందిని ఆడిషన్ చేశాం. చాలా మందికి కథలు చెప్పాం. అయితే… అందరూ భయపడ్డారు. అప్పుడు పాయల్ ధైర్యంగా ముందడుగు వేసింది. ఇప్పుడు కూడా అంతే!

ప్ర) ఇందులో కూడా బోల్డ్ సన్నివేశాలు ఎక్కువ పెట్టినట్టు ఉన్నారు?

అజయ్ భూపతి : ‘మంగళవారం’లో జీరో ఎక్స్‌పొజింగ్. నా జీవితంలో ఒక్క వల్గర్ షాట్ తీయలేదు. పాయల్ ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తే… ఆమె నగ్నంగా ఉంది అని మీరు అనుకుంటున్నారు. కానీ, ఆ పోస్టర్ ని కనుక గమనిస్తే … కళ్ళలో ఏడుస్తూ ఉంటుంది. ఆ గాఢత చూసే వాళ్ళకు అది అర్ధమవుతుంది. ఇండస్ట్రీ నుంచి పెద్ద పెద్ద దర్శకులు ఫోన్ చేసి ‘బ్యాక్ చూద్దామని పోస్టర్ ఓపెన్ చేస్తే కళ్ళ మీదకు తీసుకువెళ్ళావ్’ అని అన్నారు. థియేటర్ల నుంచి వచ్చే ప్రేక్షకులు కూడా ఏడుస్తూ వస్తారు. ఆమెను చూసి ఫీల్ అవుతారు.

ప్ర) పాయల్, నందిత కాంబోలో ఒక్క సీన్ కూడా లేదంట! ట్విస్ట్ అదేనా?

అజయ్ భూపతి :సినిమాలో అలాంటి ట్విస్ట్ లు ఒకటి కాదు రెండు కాదు చాలా ఉన్నాయి. సినిమా చివరి 45 నిమిషాలు నెక్స్ట్ లెవల్ ట్విస్టులు ఉంటాయి.వాటికి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అద్భుతంగా వచ్చింది. ‘రంగస్థలం’ చిత్రానికి నేషనల్ అవార్డు అందుకున్న సౌండ్ డిజైనర్ ఎంఆర్ రాధాకృష్ణ గారు ‘మంగళవారం’ కి పనిచేశారు. థియేటర్లలో భారీ సినిమా చూస్తున్నట్లు ఉంటుంది.

ప్ర) ‘కాంతార’ సంగీత దర్శకుడు అజనీష్ ని తీసుకోవాలనే ఆలోచన ఎవరిది?

అజయ్ భూపతి : ఆయన సూపర్ మ్యూజిక్ డైరెక్టర్! ‘కాంతార’ విడుదలైన వారానికే ఆయన వద్దకి వెళ్ళాను. ఇళయరాజాను మించిన మెలోడీ ఎవరు ఇవ్వలేరు.కానీ కొత్త సౌండింగ్ ట్రై చేయమని మ్యూజిక్ డైరెక్టర్స్ కి చెబుతూ ఉంటాను. ‘గణగణ మోగాలిరా’ పాటలో కొత్త సౌండింగ్ ఇచ్చారు. ఆరు రోజులు ఆ పాట తీశాం. 400 షాట్స్ ఉంటాయి. థియేటర్లలో పాట వచ్చినప్పుడు పూనకాలు వస్తాయి. నేపథ్య సంగీతం నెక్స్ట్ లెవల్ లో ఉంటుంది.

ప్ర) ‘అప్పడప్పడ తాండ్ర…’ పాట ఫైనల్ కట్ నుంచి తీసేయడానికి కారణం?

అజయ్ భూపతి : కొంతమంది మంది మనోభావాలు దెబ్బ తీసేలా లిరిక్స్ ఉంటాయని సెన్సార్ ఆఫీసర్లు ఫీలయ్యారు.అందుకే ఆ పాటని నేరుగా యూట్యూబ్ లో రిలీజ్ చేస్తున్నాను.

ప్ర)ఈ సినిమాకి సెన్సార్ వారు ‘ఎ’ ఇచ్చారు. అది ప్రెజర్ గా అనిపించిందా?

అజయ్ భూపతి :సినిమాకు ఒక్క కట్ కూడా ఇవ్వలేదు. విజువల్ గానీ, సౌండ్ గానీ తీయమని చెప్పలేదు. ‘ఏ’ సర్టిఫికేట్ ఇచ్చారు. హారర్ టచ్ ఉన్న సినిమాల్లో సౌండ్ భయపెట్టేలా ఉంటాయని, అందుకని ‘ఏ’ సర్టిఫికేట్ ఇచ్చామని చెప్పారు.

ప్ర) ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో అల్లు అర్జున్ నుంచి ప్రతి ఒక్కరు ప్రశంసించారు. ఈ సినిమా రేంజ్ ముందు ఊహించారా?

అజయ్ భూపతి : అల్లు అర్జున్ గారికి ఏడాదిన్నర క్రితమే కథ చెప్పాను కాబట్టి ట్రైలర్ చూసిన తర్వాత సినిమా ఎలా ఉంటుందో ఆయనకి అర్ధమైంది.

ప్ర) ‘మంగళవారం’ కి సీక్వెల్ ఉంటుందా?

అజయ్ భూపతి : ‘మంగళవారం’ సినిమాకు పొడిగింపు అయితే ఉంటుంది.దానికి సీక్వెల్, ప్రీక్వెల్, ఫ్రాంచైజీ… ఏం అంటారో నాకు తెలియదు. ఎక్స్‌టెన్షన్ అయితే పక్కాగా ఉంటుంది.

ప్ర) ‘మంగళవారం’ టైటిల్ అంటే డబుల్ మీనింగ్ అని అంతా అనుకుంటారు?

అజయ్ భూపతి : మంగళవారం శుభప్రదమైన రోజు. జయవారం అంటారు. ముందు మనకు ఆ రోజు సెలవు ఉండేది. బ్రిటీషర్ల వచ్చి ఆదివారం సెలవు చేశారు. ఈ టైటిల్ పోస్టర్ విడుదల చేయగానే పెద్ద వంశీ గారు ఫోన్ చేశారు. ”మంచి టైటిల్ అజయ్! నేను చాలాసార్లు ఆ టైటిల్ పెడదాం అంటే నిర్మాతలు ఒప్పుకోలేదు. నీ గట్స్ కి మెచ్చుకోవాలి” అన్నారు. ఆయన నుంచి ఫోన్ రావడం చాలా సంతోషంగా అనిపించింది.

ప్ర) ఈ సినిమాకి మీరు కూడా నిర్మాణ భాగస్వామి అవ్వడానికి కారణం?

అజయ్ భూపతి : నాకు (Ajay Bhupathi) ప్రొడ్యూస్ చేయాలని ఆలోచన ఎప్పటి నుంచో ఉంది. ‘మహాసముద్రం’ తర్వాత ఈ ‘మంగళవారం’ నేనే ప్రొడ్యూస్ చేయాలని అనుకున్నాను. కానీ మా బ్రదర్ సురేష్ వర్మ గారికి చెబితే ‘అజయ్! మేం కూడా సినిమా చేద్దామని అనుకుంటున్నాం. కొలాబరేట్ అవుదాం’ అని స్వాతి గారికి పరిచయం చేశారు. ఆవిడ చాలా మంచి వ్యక్తి. నేను ఎప్పుడూ రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళకు డబుల్ రెస్పెక్ట్ ఇస్తా. స్వాతి గారు కథ విని చాలా ఎగ్జైట్ అయ్యారు. ఆవిడ ముందుకు రావడం నాకు ఇంకా బూస్టప్ ఇచ్చినట్టు అయ్యింది.

ప్ర) ఈ సినిమా బడ్జెట్ ఎంత వరకు అయ్యింది?

అజయ్ భూపతి : 20 కోట్లు అయ్యింది. పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేస్తున్నాం.

ప్ర) ‘మంగళవారం’తో మీ మీద అంచనాలు పెరిగాయి. మరి, నెక్స్ట్ సినిమా ఏంటి?

అజయ్ భూపతి : ఈసారి జానర్ మార్చేశా. ఇంటెన్స్ యాక్షన్ ఎంటర్టైనర్ చేయబోతున్నాను. హీరో ఇంకా ఫైనల్ అవ్వలేదు.

జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ajay Bhupathi
  • #Mangalavaram

Also Read

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

related news

trending news

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

17 mins ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

1 hour ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

5 hours ago
19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

5 hours ago
25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

6 hours ago

latest news

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

3 hours ago
Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

4 hours ago
Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

5 hours ago
Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

6 hours ago
Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version