నందమూరి బాలకృష్ణ కూడా గ్యాప్ లేకుండా లైనప్ స్పీడ్ పెంచేస్తున్నారు. నేటితరం యువ హీరోలకు ఏ మాత్రం తక్కువకాకుండా హాట్ బ్యూటీలతో రొమాన్స్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఇక ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమాని పూర్తి చేయడానికి రెడీ అవుతున్న విషయం తెలిసిందే. ఆ సినిమా అయిన వెంటనే గోపిచంద్ మలినేనితో తన 107వ ప్రాజెక్టును పట్టాలెక్కించనున్నాడు. ఇక మరోవైపు అనిల్ రావిపూడి 108వ సినిమాను బుక్ చేసుకునేందుకు ఫిక్స్ అయ్యాడు.
ఎలాగైనా ఈసారి బాలకృష్ణ డేట్స్ దక్కించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇక లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్ ప్రకారం బాలకృష్ణ 109వ సినిమా కూడా ఫైనల్ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. నిర్మాత సి.కళ్యాణ్ తో బాలయ్యకు ఒక కమిట్మెంట్ ఉన్న విషయం తెలిసిందే. ఇక ఆ సినిమాకు హీరోయిన్, డైరెక్టర్ ఫిక్స్ అయ్యారని టాక్ వస్తోంది. బాలకృష్ణతో ఇంతకుముందు డిక్టేటర్ సినిమా చేసిన శ్రీవాస్ 109వ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నట్లు సమాచారం.
ఇక హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ ను అనుకుంటున్నట్లు తెలుస్తోంది. సాక్ష్యం సినిమాతో డిజాస్టర్ అందుకున్న అనంతరం శ్రీవాస్ మరో సినిమా చేయలేదు. ఇక బాలయ్యకు చెప్పిన కథపై పాజిటివ్ గా స్పందించారని సమాచారం. ఫుల్ స్క్రిప్ట్ ఇంకా ఫైనల్ కాలేదని తెలుస్తోంది. ఇక మరోసారి బాలయ్యని ఇంప్రెస్ చేస్తే అఫీషియల్ గా ఎనౌన్స్మెంట్ ఇవ్వనున్నారు.