బాల దర్శకత్వంలో ఎన్టీయార్!

  • August 2, 2016 / 07:33 AM IST

హీరోగా కెరీర్ మొదలెట్టింది మొదలు.. ఇప్పటివరకూ అన్నీ మాస్ సినిమాలు చేసుకుంటూ వచ్చాడు ఎన్టీయార్. ఒక్క “నాన్నకు ప్రేమతో” తప్పితే ఎన్టీయార్ కెరీర్ లో చెప్పుకోదగ్గ వైవిధమైన చిత్రం అంటూ ఏదీ ఉండదు. ప్రస్తుతం నటిస్తున్న “జనతా గ్యారేజ్” ఎన్టీయార్ నటిస్తున్న 26వ చిత్రం కాగా అనంతరం నటించబోయే 27, 28వ చిత్రాలు కూడా ఫైనల్ అయిపోయాయి. దాంతో కనీసం 30వ మైలు రాయి దాటే లోపు ఓ ప్రయోగాత్మక చిత్రంలో నటించి నటుడిగా తన స్టామినాను ప్రపంచానికి చాటి చెప్పాలని భావిస్తున్నాడట ఎన్టీయార్.

మన భారతీయ చిత్రసీమలో ప్రయోగాత్మక చిత్రమనగానే గుర్తుకొచ్చే ఏకైక దర్శకుడు బాల. ఆయన తీసిన చిత్రాల్లో సహజత్వాన్ని ఒక్కోసారి ప్రేక్షకులు కూడా భరించలేకపోయేవారు. కానీ.. ఒక దర్శకుడిగా మాత్రం బాలకు ఉన్న పేరు మరెవ్వరికీ లేదు. అందుకే తన 30వ చిత్రానికి దర్శకుడిగా బాలను ఎంపిక చేసుకొన్నాడట ఎన్టీయార్. ఇంకా చర్చల్లోనే ఈ క్రేజీ కాంబినేషన్ మెటీరియలైజ్ అవ్వడం కష్టమని సినీ విశ్లేషకులు భావిస్తున్నప్పటికీ.. ఎన్టీయార్ తలచుకొంటే అదంత కష్టమైన పనేం కాదని ఇంకొందరు భావిస్తున్నారు. ఒకవేళ నిజంగా ఈ కాంబినేషన్ సెట్ అయ్యిందంటే.. ఎన్టీయార్ లోని మహానటుడితోపాటు, బాల స్ట్రయిట్ తెలుగు చిత్రాన్ని కూడా ఒకేసారి చూసే సువర్ణావకాశం మన తెలుగు ప్రేక్షకులకు కలుగుతుంది!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus