టాలీవుడ్ దర్శకుడు కొల్లి రవీంద్రనాధ్ (బాబీ) ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. బాబి తండ్రి కొల్లి మోహన రావు గత కొంత కాలంగా కాలేయ సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. దీంతో ఆయన హైదరాబాద్ లోని ఒక ప్రెవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వస్తున్నారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆయన ఈ రోజు మధ్యాహ్నం 12.15 గంటలకు తుది శ్వాస విడిచారు అని తెలుస్తుంది. రేపు ఆయన స్వగ్రామం గుంటూరు లోని నాగారం పాలెం లో అంత్య క్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.
కొల్లి మోహన రావు గారి వయసు 69 సంవత్సరాలు.ఈ విషయం తెలుసుకున్న ఇండస్ట్రీ పెద్దలు దర్శకుడు బాబీ మరియు అతని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. ఇక రచయిత గా అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ను మొదలుపెట్టిన బాబీ రవితేజ హీరోగా నటించిన పవర్ చిత్రంతో దర్శకుడిగా మారాడు. ఆ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.
అటు తర్వాత పవన్ కళ్యాణ్ తో సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రం చేశాడు. ఇది డిజాస్టర్ అయ్యింది. తర్వాత ఎన్టీఆర్ తో జై లవ కుశ, వెంకటేష్ – నాగ చైతన్య లతో వెంకీ మామ వంటి చిత్రాలు చేసి హిట్లు అందుకున్నాడు. ప్రస్తుతం చిరంజీవి – రవితేజ లతో ఓ సినిమా తెరకెక్కిస్తున్నాడు.2023 సంక్రాంతి కానుకగా ఈ మూవీ రిలీజ్ కానుంది.